విద్యార్ధినుల కోసం వి హబ్‌ ‘విడ్స్‌’

మహిళా ఎంట్రప్రెన్యూర్లను గుర్తించి ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘వి హబ్‌’.. స్టాన్ ఫోర్డ్‌ యూనివర్సిటీ, మ్యాథ్‌వర్క్‌ల భాగస్వామ్యంతో విడ్స్‌ (వుమెన్ ఇన్ డేటా సైన్స్) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
విద్యార్ధినుల కోసం వి హబ్‌ ‘విడ్స్‌’

డిసెంబర్‌ 23 నుంచి 7 వారాలు సాగే ఈ కార్యక్రమానికి 8 పాఠశాలల నుంచి 100 మంది విద్యారి్థనులను ఎంపిక చేశారు. ఎంపికైన విద్యారి్థనులు సైన్స్ రంగంలో నైపుణ్యం పెంచుకుంటారు. డేటా సైన్స్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునేందుకు వారికి శిక్షణ ఉపయోగపడుతుందని ‘వి హబ్‌’ భావిస్తోంది. రాష్ట్రంలోని శ్రీనిధి, చిరెక్, కీ స్టోన్, ఓక్‌రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూళ్ల విద్యార్థినులతో పాటు కర్ణాటక, జమ్మూకాశీ్మర్, మహారాష్ట్ర, అస్సాంకు చెందిన ఒక్కో పాఠశాల నుంచి విద్యార్థినులు శిక్షణకు ఎంపికయ్యారు. శిక్షణను ఏటా మరింత విస్తరిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్ వెల్లడించారు. ఇప్పటివరకు ‘వి హబ్‌’ 23 కార్యక్రమాలను నిర్వహించిందని, విడ్స్‌ తో విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని ‘వి హబ్‌’ సీఈఓ దీప్తి రావుల అన్నారు. 

చదవండి: 

‘వి హబ్’ స్టార్టప్ అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి కేటీఆర్

ఏ దేశ ప్రభుత్వంతో వీహబ్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది?

వీహబ్‌తో ఒప్పందం చేసుకున్న ఈ–కామర్స్‌ సంస్థ?

#Tags