Jobs: ‘వీ హబ్’ ఉద్యోగాల్లో గోల్‌మాల్ !
సాక్షి, వరంగల్ : జిల్లా సంక్షేమ శాఖలో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అర్హులకు అందలం ఎక్కించారన్న విషయాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొత్త మిషన్ శక్తి పథకం కింద డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్‌కు సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్‌కు చెందిన నాలుగు ఉద్యోగాల్లో రెండు అనర్హులకు కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. వీరిలో ఒకరు అంగన్‌వాడీ టీచర్ కోడలు కాగా, ఇంకొకరు జిల్లా సంక్షేమ విభాగంలో పనిచేసే అకౌంటెంట్ భార్య ఉందన్న ప్రచారమైన సంగతి తెలిసిందే. అకడమిక్ మార్కులు ఇతర ఉద్యోగార్థుల్లో కొందరికంటే తక్కువగా ఉన్నా.. అనుభవం, ఇంటర్వ్యూలో అధిక మార్కులు ఇచ్చి కావాలనే తమ వారికి అప్పగించారనే చర్లు జరుగుతోంది. ఇప్పుడూ మరో నియామకం కూడా వివాదాస్పదం అవుతోంది. జిల్లా మిషన్ కోఆర్డినేటర్‌కు ఎంపికై న యువతి కూడా అదే సంక్షేమ విభాగం ఉద్యోగి బంధువు వద్ద పనిచేసిన వ్యక్తి కావడం ఇప్పుడూ చర్చకు దారి తీస్తోంది. అయితే అకడమిక్ మార్కులు ఎక్కువ ఉండడంతో పాటు అనుభవం, ఇంటర్వ్యూలో మార్కులు రావడంతో అంతా ఈ నియామకం పారదర్శకంగానే జరిగిందనుకున్నారు. అయితే, ఆ పోస్టుకు సంబంధించిన విద్యార్హత లేదని, అనుభవం పెద్దగా లేకున్నా సు‘కుమార’ంగా కానిచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు.
ఉద్యోగాలు.. అర్హతలు..
టెండర్ స్పెషలిస్ట్, స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ ఉద్యోగాలకు సోషల్ వర్క్, ఇతర సోషల్ సైన్స్ విభాగంలో డిగ్రీ, ఎకనామిక్స్, బ్యాంకింగ్‌లో డిగ్రీతోపాటు పీజీ వారికి కూడా ప్రాధాన్యం ఇస్తామని అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జిల్లా మిషన్ కోఆర్డినేటర్ పోస్టుకు మాత్రం సోషల్ సైన్స్, లైఫ్ సైన్స్, న్యూట్రిషన్, మెడిసిన్, హెల్త్ మేనేజ్‌మెంట్, సోషల్ వర్క్, రూరల్ మేనేజ్‌మెంట్‌లో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి అని తెలిపారు. పీజీకి ప్రాధాన్యం ఇస్తామని మిగతా పోస్టుల్లాగా పేర్కొనలేదు. అయితే, అర్హులను పక్కనబెట్టి, పైన పేర్కొన్న డిగ్రీలో విద్యార్హత లేని వ్యక్తికి ఈ ఉద్యోగం ఇచ్చారన్న విమర్శలున్నాయి. ములుగులో చైల్డ్‌లైన్‌లో ఓ ఎన్జీఓ తరఫున ఏడాదికి మించి పనిచేయని ఆమెకు అనుభవం మూడేళ్లు ఎలా వచ్చిందన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, జిల్లా సంక్షేమ విభాగాధికారి కార్యాలయంలో పనిచేసే వ్యక్తి ఈ నియామకాల్లో కీలకంగా మారారని పలువురు పేర్కొంటున్నారు.
Teachers: ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేపట్టాలి
చైల్డ్‌లైన్‌లో ఇదే తీరు!
చైల్డ్‌లైన్–1098లో ప్రాజెక్టు కోఆర్డినేటర్, కౌన్సిలర్, మూడు చైల్డ్‌లైన్ సూపర్‌వైజర్ పోస్టులు, మూడు కేసు వర్కర్ పోస్టులు మొత్తం 8 పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాల నియామకాల్లో కూడా అవకతవకలకు తెరలేపారన్న విమర్శలు వస్తున్నాయి. చైల్డ్‌లైన్‌లో పనిచేసే వారికి ప్రాధాన్యం కల్పిస్తూనే కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే నిబంధనను అధికారులు పట్టించుకోవడం లేదన్న టాక్ ఉంది. అర్హత, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తే బాలల సంరక్షణ చర్యల్లో జిల్లా ముందుండే అవకాశముంది. కానీ, అధికారులు అవేమి పట్టించుకోవడం లేదు. ఇప్పటికే డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ కింద భర్తీ చేసిన ఉద్యోగాల మాదిరిగానే ఇక్కడ కూడా అనర్హులకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే వాదన ఉంది. కలెక్టర్ ప్రావీణ్య దృష్టి సారించి అర్హులకు న్యాయం చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు.
జిల్లా సంక్షేమశాఖ పోస్టుల భర్తీలో అవకతవకలు ఇప్పటికే నాలుగు ఉద్యోగాల్లో రెండు అనర్హులకు.. తాజాగా మరో పోస్టులో విద్యార్హత పక్కనబెట్టారని చర్చ ఆ విభాగం ఉద్యోగులకు తెలిసిన వ్యక్తికే కట్టబెట్టారని ప్రచారం చైల్డ్‌లైన్‌లో అక్రమాలకు అవకాశం కలెక్టర్ దృష్టి సారించాలని ఉద్యోగార్థుల విజ్ఞప్తి కమిటీనే మార్కులేసింది..
Govt Junior Colleges: గెస్ట్ లెక్చరర్లను తొలగించడం సరికాదు
డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ కింద భర్తీచేసిన నాలుగు ఉద్యోగాలకు 199 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీ ఆధ్వర్యంలోనే ఉద్యోగాల నియామకం జరిగిందని జిల్లా సంక్షేమ విభాగాధికారి శారద తెలిపారు. తానే ఆ నియామకాలు చేపట్టలేదని ఆమె వివరించారు. అయితే, మెరిట్ లిస్టు అంతా తీసి కమిటీ ముందు ఉంచిన ఈ విభాగాధికారులే.. ఇప్పుడు జిల్లా కమిటీదే బాధ్యత అన్నట్లు మాట్లాడడం వెనుక ఆంతర్యమేమిటని ఆ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అర్హుల విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు కావాలంటే.. ఆ అభ్యర్థులను అడిగిన తర్వాత వారు ఇవ్వమంటే ఇస్తామని శారద వివరణ ఇవ్వడం గమనార్హం. అయితే నియామకాలు పారదర్శకంగా జరిగితే.. వారికి సంబంధించిన పత్రాలు బయటపడితే తప్పేముందని ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది.