Skip to main content

Great Grandmother Gets Masters Degree: 105 ఏళ్ల వయసులో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసిన బామ్మ..

Great Grandmother Gets Masters Degree  Virginia Hislop receiving her masters degree from a Stanford official

మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయడం సామాన్య విషయం కాదు. అందుకు చాలా పట్టుదల కావాలి.  పెళ్లి పిల్లలు తరువాత, పెళ్లికి ముందు వదిలివేసిన డిగ్రీ, లేదా ఇతర చదువు పూర్తి చేయమంటే.. ఇపుడేం చదువులే..  అని పెదవి విరుస్తారు చాలామంది. కానీ 105 ఏళ్ల  బామ్మ ఏకంగా మాస్టర్స్‌ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. 

చాలామందికి డిగ్రీ పట్టా పుచుకోవడం ఒక కలగా మిగిలిపోతుంది.  కానీ  83 ఏళ్ల క్రితం మిస్‌ అయిన స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (GSE) మాస్టర్స్ డిగ్రీని తాజాగా 105 ఏళ్ల వయసులో అందుకుంది.  వర్జీనియా "జింజర్" హిస్లాప్ తాజాగా  ఈ డిగ్రీని అందుకుంది.  దీని కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నానంటూ ఆమో భావోద్వేగానికి లోనైంది.

NEET UG Paper Leak Scam Live Updates: నీట్‌లో అక్రమాలు.. ఆ ఆరుగురు టాపర్లకు ఫస్ట్‌ ర్యాంక్‌ లేనట్లే!

1940లలో స్టాన్‌ఫోర్డ్‌లో అవసరమైన తరగతులను పూర్తి చేసింది వర్జీనియా . మాస్టర్స్ థీసిస్‌లో ఉండగా, రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. మరోవైపుఆమె ప్రియుడితో పెళ్లి. భర్త జార్జ్ హిస్లోప్ యుద్ధంలో పనిచేయడానికి వెళ్లి పోయాడు. దీంతో అమెరికాలోని అనేకమంది ఇతర మహిళల్లాగానే వర్జీనియా కూడా  చదువును త్యాగం చేయాల్సి వచ్చింది. అతనికి సాయం చేస్తూ, కుటుంబ పోషణపై దృష్టి పెట్టింది.  

Job Skills: చేసే పనిలో అప్‌డేట్‌ కావాలంటే-----కొత్త విషయాలను నిరంతరం నేర్చుకోవాలి

తాజాగా ఇద్దరు పిల్లలు, నలుగురు మనుమలు , తొమ్మిది మంది మనవరాళ్లతో కూడిన తన కుటుంబంతో హాయిగా గడుపుతోంది. అటు వర్జీనియా వాషింగ్టన్ స్టేట్‌లోని పాఠశాల, కళాశాల బోర్డులలో దశాబ్దాలుగా పనిచేశారు. కానీ డిగ్రీ  పట్టా పుచ్చుకోవాలనే తాపత్రయం ఆమెను ఊరికే కూర్చోనీయలేదు. పట్టుదలతో సాధించింది.  ఈ ఏడాది జూన్ 16, ఆదివారం తన కల మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌ని దక్కించుకుంది.  మనుమలు, మనువరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య  2024 గ్రాడ్యుయేటింగ్ ఈవెంట్‌లో కాలేజీ డీన్ డేనియల్ స్క్వార్ట్జ్ ఆమెకు డిప్లొమాను అందజేస్తోంటే  సంతోషంగా ఉప్పొంగిపోయింది.  

Published date : 20 Jun 2024 01:30PM

Photo Stories