Skip to main content

‘వి హబ్’ స్టార్టప్ అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: దేశ జనాభాలో 50 శాతం మంది యువత 27 ఏళ్లలోపు వారే ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు.
వివిధ రంగాల్లో మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ ‘వి హబ్‌’గ్రాడ్యుయేషన్‌ వేడుకలో మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘వి హబ్‌’ స్టార్టప్‌లు సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు కృషి చేస్తున్నాయని చెప్పారు. స్టార్టప్‌ల ఉత్పత్తులు ఉపయోగకరమని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వమే తొలి వినియోగదారుగా మారి కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఉత్పత్తులు అవసరమైన వారితో ‘వి హబ్‌’స్టార్టప్‌లను అనుసంధానం చేసేందుకు అవసరమైతే ప్రభుత్వమే చొరవ తీసుకుంటుందన్నారు.

చ‌ద‌వండి: నేటి నుంచి రాయలసీమ వర్సిటీ దూరవిద్య డిగ్రీ పరీక్షలు

చ‌ద‌వండి: జేఎల్‌ఎం గ్రేడ్‌–2 పరీక్ష ఫలితాలు విడుదల.. ప్రాక్టికల్స్‌ ఎప్పుడంటే..

చ‌ద‌వండి: తొలిసారిగా వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీలో ఎన్‌ఆర్‌ఐ కోటా అడ్మిషన్లు షురూ!

‘వి హబ్‌’లో మూడు కొత్త కార్యక్రమాలు
‘వి హబ్‌’ప్రారంభిస్తున్న మూడు కొత్త కార్యక్రమాలను కేటీఆర్‌ ప్రారంభించారు. వంద మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ‘ఫిక్కి ఫ్లో’సాయంతో అవసరమైన మద్దతు, దేశవ్యాప్తంగా 20 స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తుంది. డేటా సైన్స్‌, కృత్రిమ మేథస్సు సంబంధిత రంగాల్లో ఆసక్తి ఉన్న మహిళలను తయారు చేసేందుకు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలోని వుమెన్‌ ఇన్‌ డేటా సైన్స్‌ (విడ్స్‌) భాగస్వామ్యంతో దేశంలోని ఐదు నగరాల్లో వంద మంది పాఠశాల విద్యార్థుల కోసం ‘గరల్స్‌ ఇన్‌ స్టెమ్‌’కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను చేపట్టేలా 50 మంది విద్యార్థినులకు రాçష్ట్రంలోని 5 సాంకేతిక విద్యాసం స్థల ద్వారా సాయమందించేందుకు ‘వి ఆల్ఫా’అనే మరో కార్యక్రమానికి వి హబ్‌ శ్రీకారం చుట్టింది.

సరిటఫికెట్ల అందజేత
వివిధ గ్రాడ్యుయేట్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నవారిని కేటీఆర్‌ అభినందించారు. స్టార్టప్‌లకు మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేటివ్, న్యాయ, మార్కెటింగ్‌ మద్దతుతోపాటు సాంకేతిక సాయం అందించేలా తమ ఉత్పత్తులను రూపొందించిన 25 స్టార్టప్‌లు ‘ఇంక్యుబేషన్‌ సెకండ్‌ కోహర్ట్‌ గ్రాడ్యుయేషన్‌’పూర్తి చేసుకున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంట్రప్రెన్యూర్‌‌పై ఆసక్తి కలిగిన ఆరు ఔత్సాహిక స్టార్టప్‌లకు సరి్టఫికెట్లు అందజేశారు. సైబర్‌ క్రైమ్, ట్రాఫిక్, రోడ్డు భద్రత, మహిళలు, పిల్లల భద్రత తదితరాలకు సంబంధించి హైదరాబాద్‌ సిటీ పోలీసు సహకారంతో చేపట్టిన ఎర్లీప్రెన్యూర్‌ కార్యక్రమం కింద పరిష్కారాలు చూపిన 12 మంది విద్యార్థులకు సరి్టఫికెట్లు అందజేశారు.
Published date : 29 Jul 2021 04:46PM

Photo Stories