EverestDX: మూడేళ్లలో వెయ్యి ఉద్యోగాలే లక్ష్యంగా..
ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించిన ‘ఎవరెస్ట్ డీఎక్స్’ జూలై 27న హైదరాబాద్‌లో తన రెండో కార్యాలయాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కార్యకలాపాల విస్తరణ ద్వారా వచ్చే మూడేళ్లలో వేయి మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది.
చదవండి: IT Jobs: ఐటీ నజర్... ఐటీ ఉద్యోగులకు సవాళ్లతో సావాసం తప్పదా..?
ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ ఐటీ టవర్‌లోనూ తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఎవరెస్ట్ డీఎక్స్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ పెట్టుబడుల విభాగం సీఈఓ విజయ్ రంగినేని, ఎవరెస్ట్ డీఎక్స్ సీఈఓ విజయ్ ఆనంద్, సీటీఓ ప్రభు రంగస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చదవండి: Good news to IT Employees: ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా... అయితే ఈ న్యూస్ మీ కోసమే..!