Skip to main content

Vignan University Professors : వరల్డ్‌ టాప్‌ సైంటిస్ట్‌ల జాబితాలో విజ్ఞాన్ యూనివ‌ర్సిటీ ఆచార్యులు!

Vignan university professors in world top scientists list

చేబ్రోలు: గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు ఆచార్యులు వరల్డ్‌ టాప్‌ సైంటిస్ట్‌ల జాబితాలో చోటు సాధించారని వైస్‌ చాన్స్‌లర్‌ పి. నాగభూషణ్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో తమ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ అంబటి రంగారావు, కె.చంద్రశేఖర్‌, ప్రొఫెసర్‌ కె.వెంకటరావు, డాక్టర్‌ రుద్రపాల్‌ మిథున్‌, డాక్టర్‌ జోత్న్సాదేవి బోడపాటి, ప్రొఫెసర్‌ టి.సుబ్బయ్యలు వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో నిలిచారని తెలిపారు.

Science Conference : రేపు ఏపీటీఎఫ్ ఆధ్వ‌ర్యంలో విద్యా వైజ్ఞానిక స‌ద‌స్సు..

గత సంవత్సరం వరకు ఉత్తమ సైంటిస్ట్‌ల డేటాను తీసుకోవడంతోపాటు స్టాండర్డ్‌ సైన్స్‌ మేట్రిక్స్‌ క్లాసిఫికేషన్‌లో గల 44 సైంటిఫిక్‌ ఫీల్డ్స్‌, 174 సబ్‌ ఫీల్డ్స్‌ను పరిగణనలోనికి తీసుకుని ఈ ఫలితాలను వెల్లడించారని పేర్కొన్నారు. వీరికి చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య తదితరులు నగదు బహుమతులు అందించి, అభినందనలు తెలిపారు.

Published date : 21 Sep 2024 05:25PM

Photo Stories