Skip to main content

ఏ దేశ ప్రభుత్వంతో వీహబ్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది?

ఆస్ట్రేలియా ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం (వీహబ్‌)... పురోగతి (అప్‌సర్జ్‌) పేరిట చేపట్టిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల శిక్షణ (ప్రిఇంక్యుబేషన్‌) కార్యక్రమం మార్చి 10న హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
Current Affairs తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావుతో పాటు భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమిషనర్‌ బారీ ఒఫారెల్‌ తదితరలు కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగస్వామ్యం కార్యక్రమంలో భాగంగా 240 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇస్తారు.

కెనరా బ్యాంకు ఈడీగా సత్యనారాయణ రాజు
కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కె.సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. అప్పటి విజయ బ్యాంక్‌లో 1988లో చేరిన ఆయన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో (బీవోబీ) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగారు. బ్యాంకింగ్‌ రంగంలో 33 ఏళ్ల అనుభవం ఉంది. బీవోబీ ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌గా, బీవోబీ–ఐఐటీ బాంబే ఇన్నోవేషన్‌ సెంటర్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
  • కెనరా బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.
  • కెనరా బ్యాంక్‌ ప్రస్తుత చైర్మన్‌గా టీఎన్‌ మనోహరన్‌ ఉన్నారు..
Published date : 12 Mar 2021 09:44AM

Photo Stories