SVDC Degree College: విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టిసారించాలి
జిల్లాకేంద్రంలోని ఎస్వీడీసీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా జూలై 31న ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ఇష్టం ఉన్న సబ్జెక్టును ఎంపిక చేసుకుంటేనే అందులో ఉన్నతంగా రాణించగలరని చెప్పారు. అన్ని ఉద్యోగాలకు పరీక్షలు రాయాలంటే కచ్చితంగా డిగ్రీలో మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలని సూచించారు.
ఎంకాం, ఎంబీఏ వంటి ఏ కోర్సులైన పూర్తి చేసిన వెంటనే విద్యార్థులు పరిశోధనలపై దృష్టిసారిస్తే జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని, తమ ప్రతిభను పూర్తిగా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలని ఆకాంక్షించారు. కళాశాలలో ఉన్న అన్ని వసతులు ఉపయోగించుకుని విద్యార్థులు ఉన్నతంగా రాణించి.. జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
చదవండి: Department of School Examinations: ‘ఎలిమెంటరీ ఎడ్యుకేషన్’ ప్రాక్టికల్స్ తేదీలు ఇవే..
అనంతరం కళాశాల యాజమాన్యం ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఫణిప్రసాద్, డీన్ హీరోజీరావు బోంస్లే, ప్రిన్సిపల్ కుమారస్వామి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి పాల్గొన్నారు.