Skip to main content

First Robot Teacher: మొన్న‌ యాంక‌ర్‌.. ఇప్పుడు టీచ‌ర్‌.. విద్యారంగంలోకి దూసుకొస్తోన్న‌ రోబోట్స్‌... మ‌న‌ద‌గ్గ‌రే... ఎక్క‌డంటే

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ త‌న‌దైన ముద్ర వేస్తోంది. కృత్రిమ మేధస్సును ఉప‌యోగించి రూపొందించిన యాంక‌ర వీడియో ఇప్ప‌టికే వైర‌ల్‌గా మారింది. తాజాగా రోబో టీచ‌ర్ విద్యార్థుల‌కు పాఠాలు బోధిస్తోంది.
First Robot Teacher
మొన్న‌ యాంక‌ర్‌.. ఇప్పుడు టీచ‌ర్‌.. విద్యారంగంలోకి దూసుకొస్తోన్న‌ రోబోట్స్‌... మ‌న‌ద‌గ్గ‌రే... ఎక్క‌డంటే

ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి రోబో టీచ‌ర్‌ను వినియోగంలోకి తెచ్చిన బెంగ‌ళూరులోని ఇండ‌స్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ పేరు మార్మోగుతోంది. 

బెంగళూరులోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో కృత్రిమ మేధస్సుకు పట్టం కడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో (ఈగ‌ల్ రోబోట్‌) టీచర్‌ను పరిచయం చేశారు. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తున్న ఈ రోబో టీచర్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు  బోధిస్తోంది. రోబో పాఠాలు చెబుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

ఇవీ చ‌ద‌వండి: భారీగా మిగిలిపోతున్న మెడికల్‌ సీట్లు... ఈ సీట్ల‌నైతే ప‌ట్టించుకునేవారే లేరు... ఎందుకంటే

ఈ తరహా ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన రోబోట్ టీచర్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. రోబోట్ టీచర్ క‌చ్చితత్వం నూటికి నూరు శాతం ఉంటుందని.. తప్పులు చెప్పే ప్రసక్తే లేదని దీని రూపొందించిన కృత్రిమమేధస్సు నిపుణులు మిస్టర్ రావ్, మిస్టర్ రాహు చెబుతున్నారు  

robot

విద్యార్థులు కమాండ్ ద్వారా ఈ రోబోట్ ను ప్రశ్నలు అడిగి క‌చ్చితమైన సమాధానాలు పొందవచ్చు. ఈ సందర్బంగా రోబో టీచ‌ర్ రూప‌క‌ర్త‌లు మాట్లాడుతూ భవిష్యత్తులో రోబోట్ టీచర్లు ఉపాధ్యాయుల నియామకాన్ని భర్తీ చేసినా ఆశ్ఛర్య‌పోవ‌స‌రం లేద‌ని అన్నారు. రోబో టీచ‌ర్‌కు సాధారణ సెలవులు, ప్రత్యేక సెలవులు, వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, పితృత్వ సెలవులు ఇలాంటివి ఏమీ ఉండవని.. ఏడాది పొడవునా పాఠాలు చబుతూనే ఉంటుందని వీరు చెబుతున్నారు. 

ఇవీ చ‌ద‌వండి: ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో ఉద్యోగాలు... ప‌రీక్ష లేకుండానే నియామ‌కం.. 

బెంగుళూరు ఇండస్ పాఠశాలలో పాఠాలు చెబుతోన్న ఈ రోబోట్ పంతులమ్మ వీడియో ఇంటర్నెట్లో  వైరల్ గా మారింది. ఈ వీడియోలో రోబో టీచరమ్మ పాఠాలు చెప్పడమే కాదు పిల్లలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతోంది.

Published date : 01 Aug 2023 01:38PM

Photo Stories