G Kishan Reddy: నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యం.. నేనూ ఈ పాఠశాలలోనే చదివా..
అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 33 ఏళ్ల అనంతరం ప్రవేశ పెట్టిన నూతన విద్యావిధానంలో భాగంగా వివిధ కోర్సుల్లోని అంశాలను విద్యార్థులు క్షుణంగా అర్థం చేసుకునేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన మాతృభాషల్లో బోధనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఒరియ, మలయాళం తదితర భాషల్లో ఉన్నత విద్యాబోధన, పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే హై స్కూల్ స్థాయి నుంచి వృత్తి కోర్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. నిరుద్యోగ సమస్యకు వృత్తివిద్య కోర్సులే శాశ్వత పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.
చదవండి: TS TET 2025 Notification: టెట్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు, పరీక్ష తేదీలు ఇవే..
నేనూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివా...!
దేశంలో అత్యధిక శాతం మంది ప్రభుత్వ పాఠశాల్లోనే చదవుతున్నారని తాను కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినేనని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు దేశానికి పట్టుకొమ్మలని రాబోయే తరాల కోసం వాటిని పటిష్టం చేయాలన్నారు.
ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హత గల టీచర్లు ఉంటారని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత వారి పై ఉందన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు స్వచ్ఛ భారత్, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |