TS Model Schools: ఆదర్శ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు... చివ‌రి తేదీ ఇదే..

కొత్తపల్లి: కొత్తపల్లి మండలం ఎలగందులలోని తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ వి.సరిత ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రవేశ పరీక్షకు ఈనెల 12 నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్‌ 7న 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపా రు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖా స్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్‌ 1న హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.

చదవండి: Collector Jitesh V Patil: నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

#Tags