Skip to main content

Cyber ​​Security Bureau: 'సైబర్' ఉచ్చులో సదువుకున్నోళ్లు.. సైబర్ నేరగాళ్ల వలలో పడిన వారు కేటగిరీల వారీగా..

'డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఓ వాణిజ్య ప్రకటనలో వినబడే మాటిది. ఈ చిన్న లాజిక్ను మర్చిపోతు న్నారు కొందరు.
Cyber Trap

కూర్చున్న చోటు నుంచి కదలకుండా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలన్న అత్యాశకు పోతున్నారు. చివరకు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. వీరిలో ఎక్కువ మంది చదుపుకున్న వాళ్లే ఉంటుండటం గమనార్హం. సైబర్ మోసాలకు గురయ్యే వారిలో విద్యాధికులే ఎక్కువగా ఉంటున్నట్టు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్ పీఎస్ బీ) విశ్లేషణలో వెల్లడైంది. ఈ బ్యూరోను ఏర్పాటు చేసిన తర్వాత 2023 మే 1 నుంచి ఈ నెల 3 వరకు 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా, సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,02,767 ఫిర్యాదులందాయి.

మొత్తం బాధితుల్లో అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి పీహెచ్ డీ వరకు చేసిన వారు 56,437 మంది ఉండటం గమనార్హం. కాగా వీరంతా కేవలం 1930 టోల్ ఫ్రీ నంబర కు ఫిర్యాదు చేసినవారేనని.. సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేస్తున్న వారు తమ విద్యార్హత, వృత్తిగత అంశాలను తెలియజే యడం లేదని, పోర్టల్ లో ఫిర్యాదు చేసిన విద్యాధికులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇక సైబర్ మోసానికి గురైన వారిలో పూర్తిగా నిరక్షరా . కేవలం 837 మంది మాత్రమే ఉండడం విశేషం.

చదవండి: Cyber ​​Crimes: సైబర్‌ భద్రత నిపుణులకు ఉజ్వల భవిష్యత్తు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ

గతేడాది మే 1 నుంచి ఈ ఏడాది 3 వరకు అందిన ఫిర్యాదుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నేర గాళ్లు రూ.1148,40,87,056 కొల్లగొట్టినట్టు టీఎస్ సీఎస్ వీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే -రూ.463,74,36,313 కొట్టేశారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, రూ.279, 96, 41,030 కాజేయగా, రాచకొండ పోలీస్ కమిష నరేట్ పరిధిలో రూ. 191,65,83,128 బాధితులు పోగొట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిన డబ్బులో రూ.161. 65,99,989 నగదును సైబర్ సెక్యురిటీ బ్యూరో అధికారులు బ్యాంకు ఖాతాల్లో స్తంభింపజేశారు.

ఫిర్యాదు అందిన వెంటనే సకాలంలో చర్యలు తీసుకుని ఈ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్క కుండా ఆపారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ములో ఇప్పటివరకు రూ.15,42, 13,357 నగదును బాధితులకు తిరిగి ఇప్పించగలిగారు.

చదవండి: Technology Development: టెక్నాలజీ రంగంలో వేగంగా మార్పులు.. మార్కెట్‌కు తగిన స్కిల్స్‌ ఉంటేనే!

1930 కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు విద్యార్హతల వారీగా... 

విద్యార్హత

బాధితుల సంఖ్య

 పీహెచ్

208

పోస్ట్ గ్రాడ్యుయేట్లు

7750

గ్రాడ్యుయేట్లు

38,361

అండర్ గ్రాడ్యుయేట్లు

10118

పదో తరగతి వారు

6828

 పదో తరగతి లోపు వారు

2347

నిరక్ష్యరాస్యులు

837

1930 కాల్ సెంటర్ కు అందిన ఫిర్యాదుల మేరకు సైబర్ నేరగాళ్ల వలలో పడిన వారు కేటగిరీల వారీగా..

కేటగిరీ

బాధితుల సంఖ్య

ప్రైవేటు ఉద్యోగులు

30,399

స్వయం ఉపాధి

6,960

విద్యార్థులు

6,114

వ్యాపారులు

5,864

సాఫ్ట్వేర్ / ఐటీ ఉద్యోగులు

5,140

గృహిణులు

4,632

ప్రభుత్వ ఉద్యోగులు

2,768

నిరుద్యోగులు

1,679

రైతులు

1,654

వృద్దులు

1,239

Published date : 10 May 2024 05:06PM

Photo Stories