Skip to main content

Cyber ​​Crimes: సైబర్‌ భద్రత నిపుణులకు ఉజ్వల భవిష్యత్తు

సాక్షి, హైదరాబాద్‌: అన్ని రంగాల్లో సైబర్‌ భద్రత అనేది అత్యంత ప్రధానాంశంగా మారుతున్న నేపథ్యంలో సైబర్‌ భద్రత నిపుణులకు మెరుగైన భవిష్యత్తు ఉందని తెలంగాణ పోలీస్‌ అకాడమీ సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణుడు ప్రగతి రతన్‌ అభిప్రాయపడ్డారు.
bright future for cyber security professionals

ది హాకర్స్‌ మీటప్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 28న‌ హైటెక్‌ సిటీ వైట్‌ఫీల్డ్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా సైబర్‌ సెక్యూరిటీ రీసెర్చ్‌ విద్యార్థులతో సమావేశమయ్యారు.

తాజాగా జరుగుతున్న సైబర్‌ నేరాలు, సైబర్‌ నేర దర్యాప్తులో తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న విధానాలు, కేసుల చేధన, సైబర్‌ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రగతిరతన్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ వివరించారు.

చదవండి: AICTE: ఒత్తిడి తగ్గాలి.. నైపుణ్యం పెరగాలి.. ప్రతి కాలేజీలో ఈ నిపుణుల నియామకం

సైబర్‌ ఫోరెన్సిక్‌లో వాడుతున్న సాంకేతికత, వివిధ రకాల టూల్స్‌ను వివరించారు. సైబర్‌ సెక్యూరిటీ ట్రైనర్‌ కంభం అద్వైత్‌ మాట్లాడుతూ, సైబర్‌నేరాలతోపాటు సైబర్‌ టెర్రరిజం సైతం భవిష్యత్తు ప్రమాదాల్లో ఒకటని హెచ్చరించారు. సైబర్‌ టెర్రరిజానికి అడ్డుకట్ట వేసేందుకు ఎలా సంసిద్ధం కావాలో సూచించారు. 

Published date : 29 Apr 2024 03:15PM

Photo Stories