Technology Development: టెక్నాలజీ రంగంలో వేగంగా మార్పులు.. మార్కెట్‌కు తగిన స్కిల్స్ ఉంటేనే!
సాక్షి ఎడ్యుకేషన్: బీటెక్.. లక్షల మంది విద్యార్థుల స్వప్నం! బీటెక్ పూర్తి చేసుకుంటే.. జాబ్ మార్కెట్‌లో అవకాశాలు స్వాగతం పలుకుతాయనే అభిప్రాయం. బీటెక్‌తో కెరీర్‌లో త్వరగా స్థిరపడొచ్చు. సుస్థిర భవిష్యత్తుకు మార్గం వేసుకోవచ్చనే బావన!! అందుకే ఏటా లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు కృషి చేస్తున్న పరిస్థితి! ఎంట్రన్స్‌లలో ర్యాంకుతో బీటెక్‌లో చేరగానే లక్ష్యం నేరవేరినట్లు కాదు. మారుతున్న మార్కెట్ అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలు పెంచుకుంటేనే అవకాశాలు అంటున్నారు నిపుణులు!!
టెక్నాలజీ రంగంలో చాలా వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీలైన ఐవోటీ, ఏఐ, బిగ్ డేటా, రోబోటిక్స్, ఆటోమేషన్‌ల ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో.. ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ లేటెస్ట్ స్కిల్స్ సొంతం చేసుకుంటేనే అవకాశాలు దక్కే పరిస్థితి కనిపిస్తోంది.
Aryabhatta Award: పావులూరి సుబ్బారావుకు 'ఆర్యభట్ట' అవార్డు
డిజిటలైజేషన్
ప్రభుత్వ విభాగాలు నుంచి కార్పొరేట్ సంస్థల వరకూ.. నేడు అన్ని చోట్లా డిజిటలైజేషన్‌కు పెద్దపీట వేస్తున్నారు. డిజటలైజేషన్ ఆధారిత కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. నాస్‌కామ్ అంచనా ప్రకారం–వచ్చే కొన్నేళ్లలో భారత ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) మార్కెట్ తారాస్థాయికి చేరుకోనుంది. అంతే స్థాయిలో ఈ విభాగంలో నైపుణ్యాలు కలిగిన యువతకు డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి బీటెక్ విద్యార్థులు ఐఓటీ నైపుణ్యాలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
పునరుత్పాదక ఇంధనం
జాతీయ స్థాయిలో పునరుత్పాదక శక్తి రంగానికి ప్రోత్సాహమిచ్చేలా ప్రభుత్వ విధానాలు అమలవుతున్నాయి. కాబట్టి రెన్యువబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్, సోలార్ పవర్, ఎనర్జీ ఎఫిషియన్సీ విభాగాలు బీటెక్ విద్యార్థులకు కెరీర్ అవకాశాలు కల్పించనున్నాయి. ఈ విభాగాలపై ఆసక్తి పెంచుకొని నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. రెన్యువబుల్ ఎనర్జీ విభాగంలో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
TGT and PGT: టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
డేటాసైన్స్ అండ్ అనాలిసిస్
తాజాగా మాన్యుఫ్యాక్చరింగ్, సేవలు, బ్యాంకింగ్.. ఇలా అన్ని రంగాల్లోనూ కార్యకలాపాల నిర్వహణలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న మరో విభాగం.. డేటా సైన్స్ అండ్ అనాలిసిస్. సంస్థలు బిగ్ డేటా ఆధారిత సమాచార విశ్లేషణ ద్వారా వినియోగదారులను పెంచుకోవాలని కోరుకుంటున్నాయి. కాబట్టి డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, అనలిటిక్స్ విభాగాల్లో నైపుణ్యాలను సొంతం చేసుకున్న వారికి జాబ్ మార్కెట్‌లో డిమాండ్ నెలకొంది.
సైబర్ సెక్యూరిటీ
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో.. బీటెక్ అభ్యర్థులకు అవకాశాలు కల్పించడంలో సైబర్ సెక్యూరిటీ ముందుంటోంది. ముఖ్యంగా ఈ–కామర్స్, డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్‌టెక్.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇంటర్నెట్ ఆధారిత ఆన్‌లైన్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. అవి సాఫీగా సాగేందుకు వీలుగా పటిష్ట భద్రత కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో.. థ్రెట్ డిటెక్షన్, ఎథికల్ హ్యాకింగ్, డేటా ప్రొటెక్షన్ వంటి సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలున్న వారికి చక్కటి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.
Diploma Program Admissions: ఇంగ్లిష్ కమ్యూనికేషన్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
స్టార్ట్–అప్ ఎకో సిస్టమ్
దేశంలో స్టార్ట్–అప్ ఎకో సిస్టమ్ విస్తరిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులతో పోల్చుకుంటే.. భారత్ స్టార్ట్–అప్స్‌కు అనుకూలంగా మారుతోంది. ఫలితంగా బీటెక్ విద్యార్థులు తమ ఆవిష్కరణలకు రూపమిచ్చేందుకు ఎన్నో మార్గాలు, ప్రోత్సాహకాలు అందుబాటులోకి వస్తున్నాయి. స్టార్ట్–అప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి స్కీమ్‌ల ద్వారా ఔత్సాహిక ఎంట్రపెన్యూర్స్‌కు ఫండింగ్ లభిస్తోంది. దీంతో.. స్టార్ట్–అప్ ఆలోచనలున్న బీటెక్ విద్యార్థులు వీటిని అందిపుచ్చుకునేలా కృషి చేస్తే తమ ఐడియాలను విజయవంతమైన వెంచెర్స్‌గా మార్చుకోవచ్చు.
ఆర్ అండ్ డీ
రీసెర్చ్, డెవలప్‌మెంట్(ఆర్ అండ్ డీ)పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు అవకాశాలు, ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీలు, నిట్‌లు తదితర ప్రభుత్వ రంగ ఇన్‌స్టిట్యూట్స్, అదే విధంగా పరిశోధన లేబొరేటరీలు, కార్పొరేట్ రీసెర్చ్ ల్యాబ్స్ వంటివి పరిశోధనలకు వేదికలుగా నిలుస్తున్నాయి. బయో టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఏరోస్పేస్.. ఇలా విభిన్న విభాగాల్లో రీసెర్చ్‌కు అవకాశాలు లభిస్తున్నాయి.
M.Tech Course: ఎంటెక్ కోర్సులో ప్రవేశాలు
ఎలక్ట్రిక్ వెహికిల్ రంగం
ఇంజనీరింగ్, సాంకేతిక విభాగాల్లో వేగంగా ముందుకొస్తున్న మరో విభాగం.. విద్యుత్ వాహన రంగం(ఎలక్ట్రిక్ వెహికిల్ సెగ్మెంట్). దేశంలో 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచేలా కేంద్ర ప్రభుత్వం.. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ పేరుతో ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు పలు రాయితీలు అందిస్తోంది. ఫేమ్ స్కీమ్‌తో పలు రాయితీలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విభాగానికి సంబంధించిన నైపుణ్యాలు సొంతం చేసుకుంటే అవకాశాలు అందుకోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈవీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్, హార్డ్‌వేర్ ఇంజనీర్స్, ఏఐ అండ్ డేటా ఇంజనీర్స్, బ్యాటరీ ఇంజనీర్స్, టెక్నాలజీ కన్సల్టెంట్స్ వంటి కొలువులు దక్కించుకోవచ్చు.
స్పేస్ టెక్నాలజీ
స్పేస్ టెక్నాలజీ.. ఇటీవల కాలంలో విస్తృతంగా వినిపిస్తున్న మాట. అంతరిక్ష పరిశోధనల దిశగా దేశం ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ఇస్రో పలు ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సెగ్మెంట్‌లో ప్రైవేట్ ఆపరేటర్స్‌కు సైతం ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. దీంతో.. బీటెక్ ఉత్తీర్ణులు స్పేస్ టెక్నాలజీ రంగంలో శాటిలైట్ కమ్యూనికేషన్, ఎర్త్ అబ్జర్వేషన్, డేటా అనాలిసిస్, రిమోట్ సెన్సింగ్ వంటి విభాగాల్లో కొలువులను సొంతం చేసుకోవచ్చు.
Student Collapsed After Seeing 10th Results: టెన్త్ ఫలితాలు చూసి మూర్చబోయిన విద్యార్థి.. ఐసీయూలో చేర్పించాల్సి వచ్చింది