TS CET 2024 Notification: టీఎస్‌సెట్ నోటిఫికేషన్ విడుదల.. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..!
![Notification for TS CET 2024 eligibility exam for professor posts](/sites/default/files/images/2024/05/14/ts-set-2024-notification-1715680963.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్ పోస్టుల నియామకాల అర్హత కోసం టీఎస్ సెట్ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
సబ్జెక్ట్‌లు: జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్–అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం–మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
Contract Based Posts: సీఎంఎస్‌ఎస్ వేర్‌హౌస్‌లలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు..
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్‌ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: గరిష్ట వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్–2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 14.05.2024.
ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 02.07.2024
దరఖాస్తులో మార్పులకు చివరితేది: 28.07.2024, 29.07.2024.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: 20.08.2024.
పరీక్ష తేదీలు: 28.08.2024, 29.08.2024, 30.08.2024, 31.08.2024.
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, వైజాగ్, నల్గొండ.
వెబ్‌సైట్: http://telanganaset.org