Skip to main content

Silver Jubilee Govt College Admissions: సిల్వ‌ర్ జుబ్లీ ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి ప‌రీక్ష‌.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌..!

ఇంట‌ర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల‌కు సిల్వ‌ర్ జుబ్లీ ప్ర‌భుత్వ క‌ళాశాల ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతుంది. అయితే, అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న విద్యార్థుల‌కు ప్ర‌క‌టించిన వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకొని ప్ర‌వేశ ప‌రీక్ష రాయాలి. పూర్తి వివ‌రాలు ఇలా..
Degree Honors Courses Admission Notification  Silver Set-2024 Admission Notification  Release of notification for Silver Jubilee Govt College entrance exam  AP and Telangana State Students Eligible

సాక్షి ఎడ్యుకేష‌న్‌: కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ గవర్నమెంట్‌ కాలేజ్‌ (కో ఎడ్యుకేషన్, అటానమస్‌).. 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ ఆనర్స్‌ కోర్సు (ఇంగ్లిష్‌ మీడియం)ల్లో ప్రవేశాలకు నిర్వహించే సిల్వర్‌ సెట్‌–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత బోధన, భోజన, వసతి, శిక్షణ అందుతుంది.

కోర్సుల వివరాలు
     బీకాం–జనరల్‌–20 సీట్లు; బీకాం–కంప్యూటర్‌ అప్లికేషన్స్‌–20 సీట్లు; బీఏ–హిస్టరీ, ఎకనామిక్స్‌–20 సీట్లు; బీఏ–పొలిటికల్‌ సైన్స్, ఎకనామిక్స్‌–20 సీట్లు; బీఎస్సీ–కంప్యూటర్‌ సైన్స్, మ్యాథ్స్‌–20 సీట్లు; బీఎస్సీ–కంప్యూటర్‌ సైన్స్, ఫిజిక్స్‌–20 సీట్లు; బీఎస్సీ–మ్యాథ్స్, కంప్యూటర్‌ సైన్స్‌–25 సీట్లు; బీఎస్సీ–ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌–25 సీట్లు; బీఎస్సీ–బోటనీ, కెమిస్ట్రీ–20 సీట్లు; బీఎస్సీ–జువాలజీ, బయోటెక్నాలజీ–20 సీట్లు; బీఎస్సీ–మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ–20 సీట్లు; బీఎస్సీ–కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ–20 సీట్లు; బీఎస్సీ–ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్‌–25 సీట్లు.

Center For World University Rankings: వరల్డ్‌ టాప్‌ వర్సిటీల్లో చోటు దక్కించుకున్న భారతీయ విశ్వవిద్యాలయాలు ఇవే..

     అర్హత: మార్చి–2024లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అర్హులు.
     ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.06.2024.
     హాల్‌టికెట్‌/అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేది: 10.06.2024.
     కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశ పరీక్ష తేది: 16.06.2024.
     వెబ్‌సైట్‌: www.sjgckurnool.edu.in

Contract Based Posts: సీఎంఎస్‌ఎస్‌ వేర్‌హౌస్‌లలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు..

Published date : 14 May 2024 03:26PM

Photo Stories