Collector Jitesh V Patil: నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
Sakshi Education
కామారెడ్డి క్రైం: నిజాంసాగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 20న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్‌లో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 2,689 మంది బాలబాలికలు ప్రవేశ పరీక్ష రాయనున్నారని తెలిపారు. బాన్సువాడ, దోమకొండ, కామారెడ్డి, బిచ్కుంద, ఎల్లారెడ్డిలలో 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ సత్యవతి, డీఎస్పీ మదన్ లాల్, లీడ్ జిల్లా మేనేజర్ భార్గవ్ సుధీర్, డీఈవో రాజు, బీపీవో శ్రీనివాస్ రావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ సాయి భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Tenth Class exams 2024 : పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయండి
Published date : 12 Jan 2024 03:13PM