Tenth Class exams 2024 : పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయండి
వికారాబాద్ అర్బన్: పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ సీ నారాయణరెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 10వ తరగతి పరీక్షలపై ఎంఈఓలు, హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేయాలన్నారు. ప్రణాళిక బద్దంగా బోధన చేసి విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని సూచించారు.
Also Read : 10th Class Preparation Tips
గత ఏడాది ఉత్తీర్ణత శాతం తక్కువ రావడానికి గల కారణాలను అన్వేషిస్తూ అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలన్నారు. ఉపాధ్యాయులు తలచుకుంటే మంచి ఫలితాలు సాధ్యమన్నారు. టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు చేసుకోవాలని డీఈవోకు సూచించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పరీక్షల సమయంలో మండల అధికారులను విధుల్లో భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, డీసీఈబీ చైర్మన్ అనంతరెడ్డి, ఏసీ జీ రామ్‌రెడ్డి మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.