Karnataka 10th Class Results: టెన్త్ ఫలితాల్లో రైతు కుమార్తెకు 625/625 మార్కులు.. రిషబ్ శెట్టి అభినందనలు
కర్ణాటకలో తాజాగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. స్టేట్ టాపర్‌గా నిలిచిన విద్యార్ధి ఫోటోను పాన్ ఇండియా స్టార్‌హీరో రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ విజయం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.
625/625 మార్కులతో దుమ్మురేపిన రైతు కూతురు
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షా ఫలితాల్లో దుమ్మురేపింది. అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టింది. ఏకంగా 625/625 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
TS EAMCET 2024: టీఎస్ ఇంజనీరింగ్ సెట్ పరీక్ష.. ఎక్కువ ప్రశ్నలు ఆ చాప్టర్ల నుంచే..
ఆమె తండ్రి బసప్ప ఒక రైతు. తల్లి గృహిణి. ఆమె సాధించిన మార్కులతో వారి కుటుంబంలో పండుగ వాతావరణం ఉంది. అంకిత ముధోల్ తాలుకాలో ఉన్న మొరార్జీ దేశాయ్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది.
భవిష్యత్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆపై ఐఏఎస్ కావాలనేది తన టార్గెట్ అని ఆమె తెలిపింది. అంకిత విజయం పట్ల కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. ఆమె తల్లిదండ్రుల ఫోటోను ఆయన షేర్ చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో ఏడుగురు విద్యార్థులు 624 మార్కులు సాధించారని అక్కడి ప్రభుత్వం వెళ్లడించింది.
#SSLC ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಇಡೀ ರಾಜ್ಯಕ್ಕೆ ಪ್ರಥಮ ಸ್ಥಾನ ಗಳಿಸಿದ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ಅಂಕಿತಾ ಬಸಪ್ಪ ಅವರಿಗೆ ಮತ್ತು ಅವರ ಪೋಷಕರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳು.
— Rishab Shetty (@shetty_rishab) May 9, 2024
ಈ ಸಾಧನೆ ಹಲವಾರು ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಸ್ಫೂರ್ತಿಯಾಗಿದೆ.
ಉತ್ತಮ ಅಂಕ ಗಳಿಸಿ ತೇರ್ಗಡೆಯಾದ ಎಲ್ಲಾ ವಿದ್ಯಾರ್ಥಿ ವೃಂದಕ್ಕೆ ಅಭಿನಂದನೆಗಳು.#CongratulationsAnkitha #SSLCResult pic.twitter.com/8yFOjajS5W