Skip to main content

Karnataka Withdraws 4-Year Honours Degree: నాలుగేళ్ల డిగ్రీ రద్దు.. తిరిగి పాత విధానాన్నే ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

New Admissions in Karnataka Wont Offer Four Year Degrees  Karnataka Withdraws 4 Year Honours Degree  Academic Year 2024-25

కర్ణాటకలో ఇకపై నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు రద్దు కానున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నిజానికి ఇప్పటివరకు మూడో ఏడాది డిగ్రీ విద్య పూర్తయ్యేది.

కానీ నూతన జాతీయ విద్యావిధానం–2020 అమలులో భాగంగా గతేడాది ఈ విధానాన్ని రద్దు చేసి నాలుగేళ్ల కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ విధానం వల్ల నాలుగేళ్ల పాటు కోర్సులో విద్యార్థులకు నిలవడం కష్టమని, అర్హులైన అధ్యాపకుల కొరత కూడా ఉందన్న అభిప్రాయాన్ని రాష్ట్ర విద్యాశాఖ వ్యక్తం చేసింది.

US Student Visa Appointments 2024 : భారతీయ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. అమెరికా విద్యార్థి వీసాకు తేదీలు ఇవే..

 

ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ నేతృత్వంలోని ఈ కమిషన్‌ చేసిన సిఫార్సులను పరిగణలోనికి తీసుకున్న అనంతరం గతంలో మాదిరిగానే మూడేళ్ల డిగ్రీ విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు నూతన విధానం వర్తించదు. 2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్‌ తీసుకున్న వారికే ఇది వర్తిస్తుంది. 
 

Published date : 09 May 2024 04:02PM

Photo Stories