Skip to main content

US Student Visa Appointments 2024 : భారతీయ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. అమెరికా విద్యార్థి వీసాకు తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న అమెరికా విద్యార్థి వీసాకు తేదీలను ప్రకటించింది. ఈ మేర‌కు అగ్రరాజ్యం అమెరికా భారతీయ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
American Government Extends Student Visa Interview Dates till May 31st  American Indian Students Receive Good News  US Student Visa Appointments 2024  USA Student Visa Dates Released

ఫాల్ సీజన్ అడ్మిషన్లకు అనుగుణంగా అమెరికా ప్రభుత్వం మే 31వ తేదీ వరకు విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించింది. రాజధాని ఢిల్లీలోని అమెరికా ఎంబసీతో పాటు హైదరాబాద్, చెన్నె, ముంబై, కోలకతాల్లోని కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థులు ఆన్‌‍లైన్‌లో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. 

విద్యార్థుల రద్దీ దృష్ట్యా..

ఈసారి భారీగా స్లాట్లు అందుబాటులోకి తేవాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది. దశలవారీగా స్లాట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్టు అమెరికా కాన్సులేట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. జూన్ నెల స్లాట్లు ఈ నెల మూడో వారంలో, ఆ తర్వాత జులై, అవసరాన్ని బట్టి ఆగస్టు నెల ఇంటర్వ్యూ తేదీలనూ విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల రద్దీ దృష్ట్యా రాయబార కార్యాలయంతో పాటు కాన్సులేట్ కార్యాలయాల్లో మే 19, 26 తేదీల్లో ఇంటర్వ్యూ స్లాట్లను రెడీ చేశారు. 

అక్టోబ‌ర్ నెల‌లో..

వీసా జారీలో భాగంగా తొలుత విద్యార్థుల వేలిముద్రలు సేకరించి, అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అలాగే అక్టోబ‌ర్ నెల‌లో ప‌ర్యాట‌క వీసాల స్లాట్‌ల‌ను అందుబాటులోకి తీసుకోచ్చు అవ‌కాశం ఉంది.

Published date : 09 May 2024 10:14AM

Photo Stories