PSTU: 2019 తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల ప్రకటన
వచ్చే సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని యూనివర్సిటీలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ ఆగస్టు 29న ఓ ప్రకటనలో తెలిపారు. పురస్కారంగా ఒక్కొక్కరికి రూ.20,116/–నగదు అందజేసి సత్కరిస్తామని తెలియజేశారు. యూనివర్సిటీ ప్రకటించిన ప్రతిభా పురస్కారాల్లో ‘cccపత్రికా రంగం కేటగిరీలో ఎంపికయ్యారు. మిగతా వారిలో... కవిత కేటగిరీలో వి.ఆర్.విద్యార్థి, ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి (విమర్శ), యం.బాలరాజ్ (చిత్రలేఖనం), ఎస్.కాంతారెడ్డి (శిల్పం), ఎస్.సువర్ణలత (నృత్యం), డి.వి.మోహనకృష్ణ (సంగీతం), మల్లాది గోపాలకృష్ణ (నాటకం), మొలంగూరి భిక్షపతి (జానపద కళారంగం), ముత్యంపేట గౌరీశంకర శర్మ (అవధానం), పరిమళ సోమేశ్వర్ (ఉత్తమ రచయిత్రి), వల్లభనేని అశ్వనీ కుమార్ (నవల /కథ) పురస్కారాలకు ఎంపికయ్యారని రిజిస్ట్రార్ తెలిపారు.
చదవండి: