Skip to main content

Telugu Bhasha Dinotsavam : 43 మందికి తెలుగు భాషా పురస్కారాలు.. పొందిన వారు వీరే..

తెలుగు భాషకు విశేష సేవలందించిన పలువురు భాషా పండితులు, కవులను సత్కరించనున్నట్లు అధికార భాషా సంఘం, తెలుగు ప్రాధికార సంస్థ చైర్మన్‌ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ తెలిపారు.

ఏపీ ప్రభుత్వం, ఏపీ సృజనాత్మకత, సంస్కృతి సమితి(భాషా సాంస్కృతిక శాఖ), అధికార భాషా సంఘం, తెలుగు ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు చెందిన 43 మందికి ‘తెలుగు భాషా పురస్కారాలు’ ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29వ తేదీ (సోమవారం) విశాఖ ఉడా పార్కులోని చిల్డ్రన్స్ థియేటర్‌లో ఈ వేడుక నిర్వహించనున్నుట్లు తెలిపారు.

తెలుగు భాషా పురస్కారాలు పొందిన వారు వీరే..
ఈ పురస్కారాలను చలంచర్ల భాస్కరరెడ్డి(నెల్లూరు), పొన్నూరు శ్రీనివాసులు(ఒంగోలు), జంపాల గంగాధరరావు(చీరాల), యర్రంశెట్టి హనుమంతరావు(తెనాలి), సన్నిధానం శాస్త్రి(రాజమండ్రి), చిలుకూరి శ్రీనివాసరావు(కడియం), అల్లంశెట్టి చంద్రశేఖరరావు(శ్రీకాకుళం), తవ్వా ఓబుల్‌రెడ్డి (కడప), జేఎస్‌ఆర్కే శర్మ(కర్నూలు), పార్వతీదేవి (కర్నూలు), సాకం నాగరాజు(తిరుపతి), నూనె అంకమ్మరావు(ఒంగోలు), ఈతకోట సుబ్బారావు (నెల్లూరు), కె.పురుషోత్తం, ఎం.పెంచలనరసింహం(నెల్లూరు), చందు సుబ్బారావు, గోళ్ల నారాయణరావు, పి.శోభనాద్రి(ఎన్టీఆర్‌ జిల్లా), గంగవరం శ్రీదేవి(తిరుపతి), పేరూరు సుబ్రహ్మణ్యం(చిలకలూరిపేట), వినోదిని(కడప), గుత్తికొండ సుబ్బారావు(కృష్ణా), జీవీ పూర్ణచంద్‌(ఎనీ్టఆర్‌ జిల్లా), గుమ్మా సాంబశివరావు(ఎన్టీఆర్‌ జిల్లా), వెన్నా వల్లభరావు(ఎన్టీఆర్‌ జిల్లా), పి.వెంకటరావు(తూర్పుగోదావరి), జి.కృపాచారి(గుంటూరు),కె.ప్రకాష్‌(విజయనగరం), వెలమల సిమ్మన్న(విశాఖ), మెగితిల శైలజ(నెల్లూరు), పీవీ సుబ్బారావు(చిలకలూరిపేట), రసరాజు(పశ్చిమ గోదావరి), మోదుగుల రవికృష్ణ(గుంటూరు), జి.రామచంద్రారెడ్డి(ఎన్టీఆర్ జిల్లా), ఎ.లక్ష్మీకుమారి(ఎన్టీఆర్ జిల్లా), డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ(ఎన్టీఆర్ జిల్లా), తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌(హనుమాన్‌ జంక్షన్‌), డాక్టర్‌ పాలపర్తి శ్రీధర్‌(పాలకొల్లు), కె.బాలకృష్ణారెడ్డి(కడప), పి.సూర్యకుమారి(తూర్పు గోదావరి), బి.గోవర్దనరావు (విశాఖ), మస్తానమ్మ(బద్వేలు), బి.సాయి(ఎన్టీఆర్ జిల్లా)లకు అందించనున్నట్లు వివరించారు.

Published date : 29 Aug 2022 04:40PM

Photo Stories