Skip to main content

Osmania University: ఓయూకు సురవరం పేరు పెట్టాలి

సుభాష్‌నగర్‌ (నిజామాబా ద్‌ అర్బన్‌): ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాల ని, తెలుగు యూనివర్సిటీ కి పొట్టి శ్రీరాములు పేరు ను కొనసాగించాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా డిమాండ్‌ చేశారు.
osmania university should be named after suravaram

సెప్టెంబ‌ర్ 22న‌ ఆయన నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్‌ సంస్థకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేర్లు పెట్టడాన్ని స్వాగ తిస్తున్నామన్నారు.

చదవండి: CM Revanth Reddy: మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు.. ఐలమ్మ మనవరాలికి కీలక ప‌ద‌వి

తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని, పొట్టి శ్రీరాములు రాష్ట్ర నాయ కుడు కాదని, ఆయన స్వాతంత్య్ర పోరాటంలో గాంధీతో కలిసి కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. సురవరం ప్రతాపరెడ్డి అంటేనే రాజ కీయ, సాంఘిక చైతన్యానికి గుర్తుకొచ్చే పేరన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఉస్మానియా యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టి గౌరవించాలన్నారు. హైదరాబాద్‌ ను భాగ్యనగర్‌గా, నిజామాబాద్‌ను ఇందూరుగా, ఆదిలాబాద్‌ను ఎదులాపురంగా, మహబూబ్‌నగర్‌ను పాలమూరుగా, మహబూబా బాద్‌ను మానుకోటగా, వరంగల్‌ను ఓరుగల్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. 

Published date : 23 Sep 2024 04:25PM

Photo Stories