Students Talent: విద్యార్థుల ప్రతిభకు పురస్కారం.. దరఖాస్తులు ఇలా..
ప్రొద్దుటూరు: పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించిన దేవాంగ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించనున్నట్లు దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వుట్టి నాగశయనం పేర్కొన్నారు. ఆదివారం దేవాంగ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10వ తరగతిలో ఇంగ్లీషు, తెలుగు మీడియంలో 360 మార్కులు సాధించిన ప్రతిభ గల పేద విద్యార్థులకు, ఇంటర్‌లో అన్ని గ్రూపుల్లో తెలుగు, ఇంగ్లీషు మీడియంలో 750కు పైగా మార్కులు సాధించిన దేవాంగ విద్యార్థులు ఈ పురస్కారాలకు అర్హులన్నారు.
AP Inter Advanced Supplementary Exams: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే..
అర్హులైన దేవాంగ విద్యార్థులు ఈ నెల 26 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సమావేశంలో దేవాంగ సంక్షేమ సంఘం కార్యదర్శి గిద్దలూరు ఈశ్వరయ్య, ఉపాధ్యక్షుడు వుట్టి లక్ష్మినారాయణ, కల్యాణ మండపం అధ్యక్షుడు రెడ్డి చంద్రశేఖర, సుబ్రహ్మణ్యం, కార్యదర్శి వెంకటసుబ్బరాయుడు పాల్గొన్నారు.
Rashtriya Bala Puraskar: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులకు దరఖాస్తులు.. అర్హులు వీరే!