Skip to main content

Potti Sreeramulu Telugu University: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీలు ఇవే

Potti Sreeramulu Telugu University
తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీలు ఇవే

తెలంగాణలో భారీ వర్షాల వ‌ల్ల‌ వాయిదా పడిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు కొత్త తేదీలు ఖరారయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 8, 9వ‌ తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివ‌ర్సిటీ అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఇటీవల డౌన్‌లోడ్‌ చేసుకున్న పాత హాల్‌టికెట్లతోనే పరీక్షకు హాజరు కావొచ్చని తెలిపారు. ఇంకా ఎవరైనా అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోనట్లయితే ఇప్పుడు వాటిని తమ వెబ్‌సైట్‌ నుంచి పొందొచ్చని సూచించారు. ముందుగా వెల్ల‌డించిన‌ షెడ్యూల్‌ ప్రకారమైతే జులై 27, 28వ‌ తేదీల్లో ప్రవేశ పరీక్ష జరగాల్సి ఉంది.

Published date : 01 Aug 2023 03:23PM

Photo Stories