Skip to main content

Central Sahitya Akademi Award: పత్తిపాక మోహన్‌కు బాలల సాహిత్య పురస్కారం

అవార్డుల జాబితాను ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ
Dr Patipakka Mohan conferred Kendra Sahitya Academy
Dr Patipakka Mohan conferred Kendra Sahitya Academy

బాలల సాహితీ­వేత్త డా.పత్తిపాక మోహన్‌కు కేంద్ర సాహిత్య అకాడెమీ బాలసాహిత్య పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా 22 మంది రచయితలకు బాలల సాహిత్య పురస్కారాలను ప్రకటించగా, మోహన్‌ రాసిన ‘బాలల తాత బాపూజీ’ గేయ కథ తెలు­గునుంచి ఎంపికైంది. పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.చంద్రశేఖర్‌ కంబార్, కార్యదర్శి కె.­శ్రీనివాసరావు ఆగష్టు  24 న విడుదల చేశారు. డాక్టర్‌ సి.నారాయణరెడ్డి శిష్యుల్లో ఒకరైన పత్తిపాక మోహన్‌ సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించారు.  సిరిసిల్లలోనే డిగ్రీ వరకు చదువుకుని ఉస్మానియాలో ఎంఏ సాహిత్యం, పీహెచ్‌డీ పూర్తి చేశారు. తెలుగులో గజల్‌ ప్రక్రియ సమగ్ర పరిశీలన అంశంపై పరిశోధన సాగించారు. కోనరా­వుపేట మండలం నాగారంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొన్నాళ్లు పనిచేశాక నేషనల్‌ బుక్‌ట్రస్టు సంపాదకుడిగా స్థిరపడ్డారు. కవి, సాహిత్య విమర్శకులు అయిన మోహన్‌.. బాలల్లో సాహిత్యంపై మక్కువ పెంచేందుకు సినారె కథ, మన కవులు, చందమామరావే, ఆకుపచ్చని పాట, అఆఇఈ, జయహో వంటి పుస్తకాలు వెలువరించారు. 

Also read: IBRAD : అరకు కాఫీకి జాతీయ స్థాయి అవార్డు

పల్లిపట్టు నాగరాజుకు యువ సాహిత్య పురస్కారం
‘‘జంతువుగురించి మాట్లాడేముందు//మనిషిని గురించి మాట్లాడాలి//మాట్లాడే ప్రతి మాటా//మాయ మాటలు గాకుండా// మాటలు చర్చ జరగాలి!’’ అంటూ సమాజంలోని అంతరాలను తన కవితల ద్వారా ఎలుగెత్తిన పల్లిపట్టు నాగరాజు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికయ్యారు. నాగరాజు రాసిన ‘యాలై పూడ్సింది’ కవితా సంపుటిని యువపురస్కారానికి ఎంపిక చేసింది. చిత్తూరు జిల్లా రాజగోపాలపురం గ్రామానికి చెందిన నాగరాజు తన మొదటి కవితా సంపుటితోనే పలువురి దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది తెలుగుతో పాటు 23 భాషలకు చెందిన రచయితలను యువ సాహిత్య పురస్కారాలకు ఎంపిక చేశారు.

Also read: National Film Awards: 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 27 Aug 2022 05:48PM

Photo Stories