National Film Awards: 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు
2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి.ఆర్.గోపినాథ్ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన 'సూరరై పోట్రు' జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తాన్హాజీ జీవిత గాథతో హిందీలో తెరకెక్కిన 'తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా నిలిచింది. అందులో తానాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగణ్, సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన 'కలర్ ఫొటో' తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది. సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ.. రూపొందించిన తెలుగు చిత్రం 'నాట్యం' ఉత్తమ నృత్యాలు, మేకప్ విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. వీనుల విందైన పాటలతో అలరించిన 'అల వైకుంఠపురములో' చిత్రం సంగీత విభాగంలో పురస్కార విజేతగా నిలిచింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP