Yaswanth Kumar Reddy, Civils 15th Ranker: సివిల్స్‌లో నా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే.. వీరు లేకుంటే..

స‌రైన ప్రణాళిక, నిరంతరం కృషి ఉంటే అసాధ్యమనే పదానికి తావే ఉండదు. లక్ష్యం ఏపాటిదైనా కఠినశ్రమను నమ్మి ముందడుగు వేస్తే అపూర్వ విజయాలు అందుకోవచ్చని నిరూపించాడు ఆల్‌ ఇండియా సివిల్స్ 15వ ర్యాంక‌ర్‌.. తెలుగు తేజం చల్లపల్లె యశ్వంత్ కుమార్ రెడ్డి.
Yaswanth Kumar Reddy Civils AIR 15th Ranker

చిన్న వయసులోనే ఐఓసీఎల్‌లో ఇంజనీర్ ఉద్యోగం.. నెలకు రూ. 90 వేల జీతం.. కానీ అది సంతృప్తినివ్వలేదు. ప్రజలకు నేరుగా సేవచేసేందుకు కదిలాడు. ఏపీపీఎస్సీ గ‌తంలో విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో మూడో ర్యాంకుతో మెరిశాడు. అలాగే 2020లో యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 93వ ర్యాంక్ సాధించాడు.. ఇప్పుడు ఏకంగా ఆల్‌ ఇండియా సివిల్స్ 15వ ర్యాంక్‌ సాధించి యువతలో స్ఫూర్తి నింపిన‌ యశ్వంత్ కుమార్ రెడ్డితో.. సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌ (www.education.sakshi.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

కుటుంబ నేప‌థ్యం :
మాది కర్నూలు జిల్లా, చాగలమర్రి మండలం, కలుగోట్ల పల్లె గ్రామం. నాన్న పుల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు. అమ్మ లక్ష్మీదేవి గృహిణి. అన్నయ్య నాగ దస్తగిరి రెడ్డి ఐఐటీ కాన్పూర్‌లో ఎంటెక్ పూర్తి చేసి అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో (కంప్యూటర్ ఆర్కిటెక్చర్)లో పీహెచ్‌డీ చేస్తున్నాడు. 

UPSC Civil Services Results: సివిల్స్‌ సర్వీసెస్‌ ఫలితాల విడుదల.. టాప‌ర్లు వీరే..

నా ఎడ్యుకేష‌న్ :
నేను 5వ తరగతి వరకు నాన్న పాఠాలు చెప్పే కడప జిల్లా కొట్టాలలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోనే చదివాను. 6వ త‌ర‌గ‌తి నుంచి పది వరకు రాజంపేటలోని జవహర్ నవోదయ విద్యాలయలో చదివాను. ఇంటర్‌ను విజయవాడ శ్రీ చైతన్య కాలేజీలో చ‌దివాను. అలాగే బీటెక్‌(కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) జేఎన్‌టీయూ కాకినాడ నుంచి పూర్తి చేశాను. 

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

గేట్‌లో ర్యాంక్‌.. ఐఓసీఎల్‌లో ఉద్యోగం..
నేను ఇంజనీరింగ్ చదువుతూనే గేట్‌కు ప్రిపేర్ అయ్యాను. ఫైనల్ ఇయర్‌లోనే గేట్ రాసి 201 ర్యాంకు సాధించా. దీంతో ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్ సీటు లభించింది. ఎంటెక్‌లో చేరిన నెలలోపే 2016 ఆగస్టులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం రావడంతో .. ఎంటెక్ వదులుకొని ఉద్యోగంలో చేరాను. దాని వల్ల సివిల్స్ సన్నద్ధమయ్యేందుకు సమయం దొరుకుతుందనే కారణంతో ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాను.

సివిల్స్ కాద‌నీ..
ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సొంతంగా ప్రిపేర్ అవ్వడం ప్రారంభించా. అంతలోనే ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో పూర్తిస్థాయిలో గ్రూప్-1కు సన్నద్ధమయ్యాను. అయితే నాకు పోటీ పరీక్షలపై పెద్దగా అనుభవం లేకపోవడం.. సక్సెస్ స్టోరీల్లో విజేతలు వేర్వేరు పుస్తకాలు చెప్పడంతో .. మెటీరియల్ ఎంపికలో కాసింత గందరగోళం ఏర్పడింది.

Success Story: ఈ లెక్కలే.. న‌న్ను 'ఐఏఎస్‌' అయ్యేలా చేశాయ్‌.. ఎలా అంటే..?

నా గ్రూప్స్‌-1 ప్రిపరేషన్‌లో..
గ్రూప్-1 ప్రిపరేషన్‌లో భాగంగాలో సాక్షిఎడ్యుకేషన్.కామ్ ( www.education.sakshi.com ) మొదలు ఇతర పోటీ పరీక్షల వెబ్‌సైట్స్ ఉపయోగపడ్డాయి. నేను ఎక్కువగా ఇంటర్నెట్ మీదనే ఆధారపడ్డాను. ఇండియన్ హిస్టరీకి స్పెక్ట్రమ్ పబ్లికేషన్, ఆంధ్ర హిస్టరీ పూర్తిగా ఇంటర్నెట్‌లో చదువుకున్నాను. ఇంటర్నెట్‌లో దొరికే సమాచారం ఆధారంగా సొంతం నోట్స్ రాసుకున్నా. ఇక పాలిటీకి లక్ష్మీకాంత్ పుస్తకం ఉపయోగపడింది. ఇండియన్ ఎకానమీకి రమేష్‌సింగ్ పుస్తకం, ఆంధ్ర ఎకానమీకి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మాత్రమే రిఫర్ చేశాను. ఈ సర్వేను ఔపోసన పట్టా. భూసంస్కరణల గురించి నెట్ నుంచి సమాచారాన్ని సేకరించుకున్నా. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి .. అధికారిక వెబ్‌సైట్లు, ఇంటర్నెట్‌ల్లోనే చదివి షార్ట్‌నోట్స్ రాసుకున్నాను. నా స్కోరు మెరుగవడానికి ఉపయోగిన డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు నేను ప్రత్యేకంగా సన్నద్ధమవ్వలేదు. ఇంజనీరింగ్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, గేట్ సన్నద్ధత సరిపోయాయి. ఇండియాబిక్స్ వెబ్‌సైట్‌లో బిట్స్ బాగా ప్రాక్టీస్ చేసేవాణ్ని. ఇక కీలకమైన జనరల్ ఎస్సేకు కొన్ని టాపిక్స్ ఎంచుకొని ఇంటర్నెట్‌లో శోధిస్తూ మెటీరియల్ సిద్ధం చేసుకున్నాను. మొత్తంగా నా ప్రిపరేషన్‌లో మెటీరియల్ తక్కువగా ఉండేది. వాటినే పదే పదే పునశ్చరణ చేయడం లాభించింది. అయితే నేను ఉద్యోగం చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా చదవడం, రాత్రి సమయంలోనూ ఎక్కువ సమయం కేటాయించడం వల్ల టైం మేనేజ్‌మెంట్ సాధ్యపడింది. చివ‌రికి గ్రూప్‌-1లో అసిస్టెంట్ కమిషనర్‌గా ఉద్యోగం వ‌చ్చింది

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల్లో సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. పరీక్షలో ప్రశ్నలు కూడా సిలబస్ పరిధి దాటి అడగటం లేదు. కోచింగ్ అవసరం లేకున్నా బేసిక్స్ తెలుసుకొని ఇంటర్నెట్‌లో దొరికే సమాచారంతో సొంతంగా ప్రిపరేషన్చేయవచ్చు. సన్నద్ధతలో ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా, నిరుత్సాహపడకుండా సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చదవడం అంతిమంగా లాభిస్తుంది.

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

నా ఇన్స్ఫిరేషన్ ఈయ‌నే..
అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న మా అన్న నాకు స్ఫూర్తి..

అసలు ఉహించ‌లేదు..
ఇంట‌ర్వ్యూ అయ్యాక మందచి ర్యాంక్ వ‌స్తుంద‌నుకున్నా.. కానీ ఇంత మంచి ర్యాంక్ వ‌స్తుంద‌ని అసలు అనుకోలేదు.

నా సివిల్స్ ప్రిప‌రేష‌న్ ఇలా..
2016 నుంచి నా సివిల్స్ ప్రిప‌రేష‌న్‌ను ప్రారంభించాను. అప్ప‌టి నుంచి ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌తో క‌ష్ట‌ప‌డి చ‌దివాను.

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

నా ఇంట‌ర్వ్యూకు ఇలా ప్రిపేర‌య్యాను..

నేను ముందుగా ఇంట‌ర్వ్యూకు వెళ్లేముందు కొన్ని కోశ్చ‌న్స్‌కు.. ఆన‌ర్స్ రాసుకుని రాసుకున్ని .. మా ఫెండ్స్‌కు పంపించి వాళ్ల ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాను. అలాగే మాక్ ఇంట‌ర్వ్యూల‌కు కూడా హాజ‌ర‌య్యాను. అలాగే ఐపీఎస్ మ‌హేష్ భ‌గ‌వ‌త్ సార్‌గారి స‌ల‌హాలు..సూచ‌న‌లు కూడా ఎంతోగానో ఉప‌యోగప‌డ్డాయి. ఇలా చేయ‌డంతో నాలోని లోటుపాట్లు స‌రిచేసుకుని ఇంట‌ర్వ్యూకు హాజ‌రయ్యాను. 

నా విజయంలో వీరిదే..
నా ఈ సివిల్స్ స‌క్సెస్‌లో మా అన్న‌, మా తల్లిదండ్రులు, నా ఫెండ్స్‌.. అందరి భాగం ఉంది. నా విజ‌యానికి చాలా మంది కష్ట‌ప‌డ్డారు. వీరు నా క‌న్నీరు కూడా పంచుకున్నారు. వీరి వ‌ల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా..

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

నా స‌ల‌హా :
హార్డ్ వ‌ర్క్ చేస్తే.. ఈ రోజు కాకున్న రేపైనా విజ‌యం ఖాయం. ఇదే నేను నమ్మిన సిద్దాంతం. నేను ఎక్క‌డ కోచింగ్ లేకుండానే సొంత ప్రిప‌రేష‌న్‌తోనే ఈ ర్యాంక్ సాధించాను. స‌రైన మెటీరియ‌ల్ ఉప‌యోగించి చ‌దివితే మీరు కూడా విజ‌యం సాధించ‌గ‌ల‌రు.

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..

నా ప్రొఫైల్:
☛ పదో తరగతి మార్కులు: 10 జీపీఏ
☛ ఇంటర్: 950
☛ ఎంసెట్ ర్యాంకు: 337
☛ బీటెక్: 84.7 శాతం (గోల్డ్ మెడలిస్ట్)
☛ గేట్ :201 ర్యాంక్‌
☛ గ్రూప్ -1 మార్కులు: మెయిన్స్ మార్కులు: 445.5, ఇంటర్వ్యూ: 66
☛ 2020 సివిల్స్‌లో.. : 93వ ర్యాంక్‌
☛ 2021 సివిల్స్‌లో.. : 15వ ర్యాంక్‌

Success Story: అప్పులు చేసి ఐపీఎస్ చదివించారు.. కానీ..

Listen about his success journey in the below video, when he secured 93rd rank in 2020..

#Tags