IPS Diksha Officer Success Story : పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు.. బెస్ట్‌గా ఉండాలంటే.. నేను చెప్పేది ఒక్కటే.. ఇలా చదివితే చాలు..
ఇలాగే ఈ యువ ఐపీఎస్ కూడా తమ తల్లిదండ్రులు కోరికను తీర్చి.. వీరి గిఫ్ట్‌గా ఐపీఎస్ అనే సక్సెస్ ను ఇచ్చారు ఈ కూతురు. ఈమే.. యువ ఐపీఎస్ అధికారి దీక్ష. అలాగే ఈమె ఐపీఎస్ ట్రైనింగ్‌లో కూడా బెస్ట్ అనిపించుకున్నారు. అలాగే ఈమెకు ట్రైనింగ్‌లో బెస్ట్ ఔట్‌డోర్ ప్రోబేషనర్ అవార్డు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ యువ ఐపీఎస్ అధికారిని దీక్ష సక్సెస్ స్టోరీ మీకోసం..
☛ IPS Success Story : మూడుసార్లు ఫెయిలైన.. నా లక్ష్యాన్ని మాత్రం అపలేదు.. కారణం ఇదే..
కుటుంబ నేపథ్యం :
దీక్ష.. రాజస్థాన్ లోని జుంజున్ జిల్లా ఖేత్రీ పట్టణం. నాన్న అక్కడే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఏజీఎంగా పనిచేస్తారు. మా అమ్మ గవర్నమెంట్ టీచర్.
ఎడ్యుకేషన్ :
ఐఐటీ ఢిల్లీ నుంచి నేను బీటెక్(టెక్స్‌టైల్ టెక్నాలజీ)పూర్తి చేశాను. ఆ తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్‌ను ప్రారంభించాను.
☛ Civils Ranker Success Story : నా జీవితంలో ఎదురుదెబ్బలు ముందు వచ్చాయ్.. అందుకే..
ఆయన నాకు ప్రతి విషయంలోనూ..
మా నాన్నకు నన్ను ఐపీఎస్‌గా చూడడం ఎంతో ఇష్టం. ఆయన ప్రోత్సాహంతోనే నేను సివిల్స్‌వైపు దృష్టి పెట్టాను. ఆయన ప్రతి విషయంలో నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటారు. అలాగే మా సీనియర్స్ కూడా సివిల్స్ గురించి గొప్పగా చెప్పడం కూడా ఒక కారణం. సివిల్స్ రెండో ప్రయత్నంలో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌కు ఎంపికయ్యాను. ఆ తర్వాత మళ్లీ మా నాన్నప్రోత్సాహంతో మూడోసారి సివిల్స్ రాశాను. అలా నాకు మూడో ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చింది. ఈ శిక్షణకు వచ్చినప్పుడు చాలా ఆందోళనగా అనిపించింది.కానీ క్రమంగా అన్నీ నేర్చుకున్నాను.
☛ IPS Success Story : నన్ను విమర్శించిన వారే.. ఇప్పుడు తలదించుకునేలా చేశానిలా..
ఇందుకు నేను ఉదాహరణ.. ఎందుకంటే..?
గుర్రపు స్వారీ, గన్ షూటింగ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇలా ప్రతి పని నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. మహిళలు ఏదైనా సాధించగలరు.. మన శక్తి ఏంటో మనం గుర్తించాలి. అప్పుడు మనం చేసే పనిలో ఆత్మవిశ్వాసంతో చేయగల్గుతాం. అందుకు నేను ఉదాహరణ. నాకు బెస్ట్ ఔట్‌డోర్ ప్రోబేషనర్ అవార్డు వచ్చింది. ఆ విషయం తెలియగానే మొట్టమొదట మా నాన్నకే ఫోన్ చేసి చెప్పా.. ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. నాన్న డ్రీమ్ పూర్తి చేశానన్న తృప్తి నాకు ఎంతో అనిపించింది. నాకు బీహార్ కేడర్ ఐపీఎస్ ఇచ్చారు.
మా శిక్షణలో..
ఎంపికై ఇక్కడ శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాక రోజులో 13 గంటలపాటు శ్రమించేదాన్ని. కఠినమైన శిక్షణ ఉండేది. తొమ్మిది కేజీల బరువుతో 40 కిలోమీటర్ల దూరం అర్ధరాత్రుళ్లు నడవాల్సి ఉంటుంది. ఎందుకీ కష్టం అనిపించేది. సాధారణ మహిళగా ఉండే నన్ను ఓ శక్తిమంతమైన పోలీసు ఆఫీసర్‌గా తీర్చిదిద్దింది ఈ శిక్షణే కదా అని గుర్తుకొచ్చిన మరుక్షణం.. నైరాశ్యాన్ని పక్కనపెట్టి అందరికన్నా ముందుండేదాన్ని. ఈ శిక్షణలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసంతో పాటు భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకున్నా. ఇండోర్, అవుట్‌డోర్ శిక్షణలో ప్రథమ స్థానంతోపాటు స్వార్డ్ ఆఫ్ ఆనర్ గౌరవాన్ని అందుకున్నా. ది బెస్ట్ అవుట్‌డోర్ ప్రొబెషనర్‌గా, ప్లటూన్ కమాండర్‌గా నిలిచాక నేను పడిన కష్టమంతా మరచిపోయా.
☛ Inspiring Success Story : ప్రసూతి సెలవుల్లో సివిల్స్‌కు ప్రిపేరయ్యా.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ..
అకాడమీ చరిత్రలో..
వల్లబాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో చరిత్రలో ఈ స్థానాన్ని దక్కించుకున్న రెండో మహిళగా నిలవడం గర్వంగా ఉంది. క్షేత్ర పర్యటనలో భాగంగా ఒకసారి జైలుకెళ్లాం. అనుకోని తప్పిదాలతో శిక్ష అనుభవిస్తూ.. ఆ తర్వాత పశ్చాత్తాపంతో కుంగిపోతున్న వారినెందరినో చూశా. వారి కథలను మరవలేను. అనుకున్నది సాధించగలిగే సత్తా మనందరిలోనూ ఉంటుంది. మనల్ని మనం నమ్మితే చాలు.
☛ Success Story : ఇంట్లోనే ఉండి చదివా.. సివిల్స్ కొట్టానిలా.. కానీ.. నా లక్ష్యం మాత్రం ఇదే..
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి నేను చెప్పేది ఒక్కటే...
సివిల్స్ లేదా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి నేను చెప్పేది ఒక్కటే... మన లక్ష్యం ఏంటి...? ఎలా సాధించాలన్నదానిపై స్పష్టత ఉండాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక పెట్టుకుని చదవాలి. శ్రద్ధగా, నిష్టగా ఉండాలి.. అలా అని మిగిలిన విషయాలు వదిలేయద్దు. మనకు నచ్చినట్టు రిలాక్స్ అవ్వాలి. ఎంత ఏకాగ్రతతో చదువుతామన్న దాన్ని బట్టి రోజుకు ఎన్ని గంటలు చదవాలన్నది ఉంటుంది. నేను రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే చదివాను. పరీక్ష దగ్గరపడే కొద్ది కొద్దిగా పెంచుతూ వెళ్లా.. రోజుకు 10 గంటలకు పెంచాను. ఇలా చదివితేనే నాకు విజయం వచ్చింది.
➤ Success Story : నలుగురు తోబుట్టువుల్లో.. ముగ్గురు ఐఏఎస్‌లు.. ఒక ఐపీఎస్.. వీరి సక్సెస్ సీక్రెట్ మాత్రం ఇదే..