Meghanath Reddy,IAS: గుమాస్తాగా పని చేస్తూనే.. న‌న్ను ఐఏఎస్ చ‌దివించారు.. కానీ

‘నిరుపేద కుటుంబం.. తనకు దక్కని చదువు.. పిల్లలకు దూరం కాకూడదని.. తండ్రి పడిన శ్రమ.. కలెక్టర్ అయితే ప్రజలకు సేవ చేసే భాగ్యం లభిస్తుందని.. ఎందరో నిజాయితీ గల కలెక్టర్ల గురించి తండ్రి నిరంతరం చెప్పిన మాటలే తనకు ఆదర్శమయ్యాయి.
J Meghanath Reddy, IAS

ఈ మాట‌లే.. సివిల్స్ దిశగా అడుగులు వేయడానికి స్ఫూర్తినింపాయని.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్‌పీఎస్ సెలక్షన్ వచ్చినా ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకుని నిరంతర శ్రమతో మూడో ప్రయత్నంలో సాధించానని’ చెబుతున్న జోగిరెడ్డి మేఘనాథ్‌రెడ్డి విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే.. మీకోసం..

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి

గుమాస్తాగా పని చేస్తూనే.. 
నాన్న ఈశ్వరరెడ్డికి చదువంటే ప్రాణం. ఇందుకు కారణం నిరుపేద కుటుంబం కావడం.. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో వస్త్ర దుకాణంలో గుమాస్తాగా పని చేస్తూనే మా చదువులకు ఆటంకం కలగకుండా సౌకర్యాలు అందించారు. 

‘సివిల్స్’ అనే పదానికి అర్థం తెలియని వయసులో..


కేవలం చదువులే కాదు.. వాటికి సార్థకత ఉండాలి. సమాజానికి ఉపయోగపడాలి. ఇందుకు సరైన అవకాశం ఐఏఎస్ ఆఫీసర్ కావడమే అని నిరంతరం చెబుతుండేవారు మా నాన్న‌. ‘సివిల్స్’ అనే పదానికి అర్థం తెలియని వయసు నుంచే దాని గురించి చెబుతూ స్ఫూర్తినింపేవారు. ఇంత స్థాయిలో ఆయన పడుతున్న తపనకు న్యాయం చేయాలని చిన్నప్పటి నుంచే భావించాను.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

నా చ‌దువు.. :
ఇంటర్ పూర్తయ్యాక హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్‌లో సీటు లభించింది. దీంతో బీఏ సమయం నుంచే సివిల్స్ లక్ష్యం దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టాను. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ (ఎకనామిక్స్)లో ప్రవేశం దక్కింది. నిజాం కాలేజ్‌లో కలిసొచ్చే అంశం.. అక్కడ ఆర్ట్స్ గ్రూప్స్ విద్యార్థుల్లో ప్రతి ఒక్కరూ సివిల్స్‌పై ఆసక్తి చూపడం. సిటీలో పేరున్న పలు కోచింగ్ సెంటర్ల వద్దకు వెళ్లడం, అక్కడి సీనియర్ల గెడైన్స్ తీసుకోవడం, సిలబస్‌పై అవగాహన పొందడం, ప్రామాణిక పుస్తకాల ఎంపిక వంటి వాటితో సివిల్స్ ప్రస్థానానికి నాంది పలికాను. తర్వాత ఎంఏ సమయంలో కోర్సు సబ్జెక్ట్స్‌తోపాటు సివిల్స్ సబ్జెక్ట్స్‌పై అవగాహన పెంచుకోవడం మొదలుపెట్టాను.

Inspirational Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా

కోచింగ్‌కు ఢిల్లీ వెళ్లినా.. సొంత ప్రిపరేషన్‌తోనే.. 
2009లో ఎంఏ పూర్తయిన వెంటనే కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లాను. కానీ జనరల్ స్టడీస్, నేను ఎంచుకున్న రెండు ఆప్షనల్స్ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ)లో కేవలం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోచింగ్ తీసుకున్నాను. ఈ సబ్జెక్ట్‌లో ఐఎఫ్‌ఎస్ అధికారి నరేంద్ర నిర్వహించిన టెస్ట్ సిరీస్‌లు ఎంతో ఉపయోగపడ్డాయి. మిగతా అంతా సొంత ప్రిపరేషన్ సాగించాను.

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

తొలి ప్ర‌యత్నంలోనే..


సివిల్స్ ఎగ్జామినేషన్-2010 తొలి అటెంప్ట్ ఇచ్చాను. 2011లో ఇంటర్వ్యూ జరిగి తుది ఫలితాల్లో 626వ ర్యాంకుతో ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్‌లో సెలక్షన్ వచ్చింది. ఇది కొంత కన్ఫ్యూజన్‌కు గురి చేసింది. ఓవైపు జాతీయ స్థాయి పరీక్షలో సెలక్షన్ వచ్చిందనే ఆనందం.. మరోవైపు నిజమైన లక్ష్యం ఐఏఎస్ రాలేదనే నిరుత్సాహం. రెండో ప్రయత్నం (2011)లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా తుది ఫలితాల్లో వైఫల్యం ఎదురైంది. అయితే వైఫల్యానికి కారణాలపై ఆత్మ విమర్శ చేసుకున్నాను. ఈ క్రమంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్‌లో తప్పులు చేశానని గుర్తించాను. వాటిని సరిదిద్దుకుని విజయం సాధించాను.

IAS Success Story: మారుమూల పల్లెటూరి యువ‌కుడు.. ఐఏఎస్ కొట్టాడిలా..

లభించిన‌ సమయంలోనే.. 
2012 సివిల్స్ ప్రిపరేషన్‌కు సరైన సమయం లభించేది కాదు. కారణం.. ఐఆర్‌పీఎస్ ఫౌండేషన్ కోర్సు ఉదయం అయిదున్నరకు మొదలై సాయంత్రం నాలుగున్నర లేదా అయిదు గంటల వరకు సాగేది. ప్రిపరేషన్‌కు లభించే సమయం నాలుగు గంటలే. ఆ సమయాన్నే ప్రొడక్టివ్ వ్యూలో సద్వినియోగం చేసుకున్నాను. శని, ఆదివారాల్లో పూర్తి స్థాయి ప్రిపరేషన్ సాగించాను.

Sumit Sunil IPS: డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూనే.. ఐపీఎస్‌ అయ్యానిలా..

ఇవే నా వ్యూహాలు..


ప్రిలిమ్స్ రిజల్ట్స్ తేదీకి, మెయిన్స్ పరీక్షలకు మధ్య లభించిన వ్యవధి నాలుగు నెలలే. ఈ సమయంలో నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాను. మొదటి రెండు నెలల్లో ప్రతి సబ్జెక్ట్ పూర్తి చేయడం; మిగతా రెండు నెలల్లో చదివిన అంశాల రివిజన్‌కు కేటాయించడం ఇవే నా వ్యూహాలు. కొన్ని టాపిక్స్‌లో రెండో రివిజన్ కూడా పూర్తి చేశాను. ఇలా.. మెయిన్స్‌లో సత్ఫలితం సొంతం చేసుకున్నాను.

Anudeep Durishetty, IAS: నేను సివిల్స్‌లో ఫ‌స్ట్ ర్యాంక్ సాధించ‌డానికి కార‌ణం ఇదే..

ఈ పుస్త‌కాల‌తో..
జనరల్ స్టడీస్ విషయంలో ఆయా సబ్జెక్టుల ప్రామాణిక పుస్తకాలను సేకరించి.. సిలబస్, గత ప్రశ్న పత్రాల ఆధారంగా ముఖ్యాంశాలను గ్రహించి వాటిపై ఎక్కువ దృష్టి సారించాను. సోషియాలజీలోనూ ఇదే వ్యూహం అనుసరించాను. ముఖ్యంగా బేసిక్ బుక్స్‌గా భావించే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఒకట్రెండుసార్లు చదివాను. జనరల్ ఎస్సే కోసం ప్రతి రోజు కనీసం మూడు, నాలుగు పేపర్లు చదివాను.

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే

నా ఇంటర్వ్యూ సాగిందిలా..:
పురుషోత్తమ్ అగర్వాల్ బోర్డ్‌తో నా ఇంటర్వ్యూ జరిగింది. బోర్డు సభ్యులు ఎంతో సుహృద్భావంగా వ్యవహరించారు. సమాధానాలిచ్చేప్పుడు తడబడ్డా కూడా దాన్ని రాబట్టే విధంగా ప్రోత్సహించారు. ఇలా దాదాపు 25 నుంచి 30 నిమిషాల వ్యవధిలో ఇంటర్వ్యూ జరిగింది. బయోడేటా మొదలు తెలుగు సినిమా వరకు పలు ప్రశ్నలు అడిగారు. 

Anu Kumari, IAS : కొడుకును చూసుకుంటూనే..రెండో ప్రయత్నంలోనే రెండో ర్యాంక్‌

అడిగిన ప్ర‌శ్న‌లు..
➤ ఐఆర్‌పీఎస్-బరోడాలో ఉన్నారు కదా.. గుజరాతీ నేర్చుకున్నారా?
➤ సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్స్ మీద మీ అభిప్రాయం?
➤ డిజిటల్ డివైడ్‌ను వివరించండి?
➤ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అంటే ఏంటి?
➤ సార్క్ దేశాలు సాధించిన ప్రగతి? సార్క్ దేశాలపై భారత్ ఏమైనా ఆధిపత్యం చెలాయిస్తోందా?
➤ రైల్వే వ్యవస్థపై ప్రతికూల వ్యాఖ్యానాలున్నాయి? వాటిపై మీ విశ్లేషణ?
➤ తెలుగు సినిమాల గురించి వివరించండి?
➤ మ్యాట్రిలీనియల్ సొసైటీ అంటే ఏంటి?
➤ డెఫిషిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి?

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

సివిల్స్ ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు నా సలహా ఇదే..:
ముందుగా సివిల్స్ అంటే మహా సముద్రం అనే అపోహ వీడాలి. ఆ తర్వాత లక్ష్యంపై స్పష్టత ఏర్పరచుకోవాలి. సివిల్స్ విధి విధానాలు, సిలబస్, గత ప్రశ్న పత్రాలు, ప్రస్తుత శైలి పరిశీలించాలి. అప్పుడు మనకున్న పరిజ్ఞానం ఏంటి? ఇంకా ఏం చదవాలి? అనే విషయాలు అర్థమవుతాయి. దాంతో సగం కసరత్తు పూర్తయినట్లే. ప్రస్తుత అభ్యర్థులు కేవలం ప్రామాణిక పుస్తకాలకే పరిమితం కాకుండా ఇంటర్నెట్‌ను వినియోగించుకోవాలి. అందులో అమూల్య సమాచారం లభిస్తుంది.

Success Story: ఇలా చ‌దివా.. సివిల్స్ కొట్టా

కుటుంబ నేపథ్యం:
తండ్రి: ఈశ్వర్ రెడ్డి,
తల్లి: లక్ష్మీ దేవి,
సోదరి: శాంతి(ఎంబీఏ)

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

నా అకడెమిక్ ప్రొఫైల్ : 
1. పదో తరగతి (2002)- 551 మార్కులు
2. ఇంటర్మీడియెట్ (2004)- 948 మార్కులు
3. బీఏ (2007)- 82 శాతం (కాలేజ్ టాపర్)
4. ఎంఏ ఎకనామిక్స్ (2009)- 86 శాతం

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

నాకు ప్రేరణనిచ్చిన ఆర్టికల్స్..
నా సివిల్స్ విజయ ప్రస్థానంలో సాక్షిభవితలో ప్రచురితమైన ఆర్టికల్స్ ఎంతో తోడ్పడ్డాయి. నేను ఢిల్లీలో ఉన్న సమయంలో భవిత అందుబాటులో ఉండేది కాదు. మా నాన్న వాటిని పోస్ట్ ద్వారా నాకు పంపేవారు. నేను ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాసినప్పటకీ తెలుగులోని భవిత వ్యాసాలను అనువదించుకొని చదివాను. మరో విషయం.. సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌లో ఉన్న‌ ఐఏఎస్ అధికారి రాజమౌళి రాసిన వ్యాసాలు నాకు మానసిక స్థైర్యాన్ని, ప్రేరణ ఇచ్చి లక్ష్యాన్ని చేరుకునేలా చేశాయి. ఆయన రాసే వ్యాసాల్లో ప్రేరణాత్మక వాక్యాలు నాలో ఎంతో ఉత్తేజాన్ని నింపాయి.

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

#Tags