Success Story: ఇలా చదివా.. సివిల్స్ కొట్టా
నిరంతర శ్రమ, అకుంఠిత దీక్షతో విజయతీరాలను చేరుకున్నారీ ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థి మాధురి. సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ట్రిపుల్ ఐటీ- హైదరాబాద్‌లో బీటెక్ 2015 బ్యాచ్‌కు చెందిన మాధురి గడ్డం జాతీయస్థాయిలో 144వ ర్యాంకు సాధించారు. మాధురి సొంత ప్రాంతం హైదరాబాద్ నగరం. సివిల్స్‌కు ప్రిపేరైన విధానం, తనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు, కష్టపడిన పద్ధతులు తదితర అనుభవాలను సాక్షికి వివరించారు.
ఇలా చదవడం ఎంతో మేలు చేకూర్చింది..
టిపుల్ ఐటీ హైదరాబాద్‌లో చదవడం ఎంతో మేలు చేకూర్చిందని మాధురి అభిప్రాయపడ్డారు. మావనతా విలువలకు సంబంధించిన కోర్సులో చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా అధ్యాపకులు కమల్, రాధిక, కన్నన్ శ్రీనాథన్, నందకిషోర్ ఆచార్య చర్చలు, తరగతి గదిలో చెప్పిన పాఠాలు ఎంతో తోడ్పాటును అందించారుు.
టిపుల్ ఐటీ తర్వాత దేని కోసం చదివారు?
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేశాక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం కావాలనుకున్నా. మూడేళ్లపాటు కష్టపడ్డాను. రెండోసారి రాసి 144వ ర్యాంకు సాధించాను.
సివిల్స్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
ప్రజలు, సొసైటీకి సేవ చేయాలన్నదే లక్ష్యం. ఒకవేళ సివిల్ సర్వీసెస్‌లో ఎంపిక కాకపోయింటే మంచి నాలెడ్జి సాధించాననే తృప్తి మిగిలేది. కానీ రావడం ఎంతో సంతోషానిచ్చింది.
సివిల్ సర్వీసెస్‌కు ఎలా ప్రిపేరయ్యారు?
సివిల్ సర్వీసెస్ ఒక లాంగ్ ప్రాసెస్. మూడు దశల్లో పరీక్ష ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ దశలో నెగెటివ్ మార్కులుండే విధానం. రెండో దశలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ తొమ్మిది పేపర్లు ఉంటాయి. చివరి దశలో 30 నిమిషాలు పర్సనాలిటీ టెస్ట్ ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంజినీరింగ్ చదివిన వారికి లాభనష్టాలు రెండూ ఉంటారుు.
సివిల్స్ పరీక్షలకు ఎవరైనా తోడ్పాటు అందించారా?
సీనియర్లు పంకజ్ కుమావత్, హిమానుజన్, గరిమా అగర్వాల్ తోడ్పాటు అందించారు. ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసే వారు కూడా సివిల్స్‌కు ప్రిపేర్ కావాలి.
Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..