IPS Success Story : ఈ అసంతృప్తితోనే.. ఐపీఎస్ సాధించా.. కానీ..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిస‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించే సివిల్స్ ప‌రీక్ష‌ల్లో ఆరు సార్లు ప్రయత్నం సివిల్స్‌లో విజ‌యం సాధించారు రంజీత శర్మ. హైద‌రాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఈమె ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకున్నారు.
ఐపీఎస్ రంజీత శ‌ర్మ స‌క్సెస్ స్టోరీ

ఈ ట్రైనింగ్‌లో ఈమె మాత్రం అతివ శక్తిని చాటింది. ఐపీఎస్‌ ఔట్‌డోర్‌ ట్రైనింగ్‌లో మగవారిని పక్కకు నెట్టి ప్రథమ స్థానాన్నికైవసం చేసుకొని ప్రధానమంత్రి బ్యాటన్‌, హోం మినిస్టర్‌ రివాల్వర్‌ అందుకుంది.

IPS Success Story : ల‌క్ష‌ల్లో వ‌చ్చే జీతం.. కానీ నా ల‌క్ష్యం మాత్రం ఇది కాదు.. చివ‌రికి..

ఈ ఘనతను సాధించిన తొలి మహిళాగా..
బెస్ట్‌ ఆల్‌రౌండ‌ర్‌ లేడీ ఐపీఎస్‌ ప్రొబెషనరీ ఆఫీసర్‌ సహా ఐదు ఉత్తమ అవార్డులను సొంతం చేసుకుంది. సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో జరిగిన‌ 2019 బ్యాచ్ ఐపీఎస్‌ల దీక్షాంత్‌ పరేడ్‌కు పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించింది. ఈ ఘనతను సాధించిన తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిగా నిలిచిన రంజీత శ‌ర్మ‌.  అవ‌కాశం ఇస్తే ఆడవారు అద్భుతాలు చేస్తారని మరోమారు నిరూపించింది యువ ఐపీఎస్‌ రంజీత శర్మ. ఈ నేప‌థ్యంలో ఐపీఎస్ రంజీత శ‌ర్మ స‌క్సెస్ స్టోరీ మీకోసం..  

కుటుంబ నేప‌థ్యం :

మా నాన్న‌ ఓ పల్లెలో చిన్న వ్యాపారి. మా చదువుల కోసం ఎంతో కష్టపడేవారు. మాది హరియాణాలోని ఫరీదాబాద్‌ జిల్లా ధైనా గ్రామం. నాన్న సతీశ్‌కుమార్‌ శర్మ, అమ్మ సవిత. ఇద్దరు అన్నయ్యలు, నేను.

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

నా ఎడ్యుకేష‌న్ : 
నా చ‌దువు అంతా ఢిల్లీలోని ప్రైవేట్‌ పాఠశాలలో సాగింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాను. తర్వాత ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ నుంచి పబ్లిక్‌ రిలేషన్స్‌లో పీజీ చేశాను. 

ప్రైవేట్‌ కంపెనీల్లో..
8 సంవ‌త్స‌రాల పాటు.. ప్రైవేట్‌ కంపెనీల్లో పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా చేశాను. కానీ మ‌దిలో అసంతృప్తి ఉండేది. ప్రజలకు ఏదో చేయాలనిపించేది. ప్రైవేట్‌ ఉద్యోగాలతో అది సాధ్యం కాదనిపించేది. ఇదే విషయం నాన్నతో చెబితే సివిల్స్‌ లక్ష్యం చేసుకోమన్నారు. ఆయన ప్రోత్సాహమే లేకుంటే ఇప్పుడిక్కడ ఇలా ఉండేదాన్నే కాదు.‘బేటా! నువ్వు ఐపీఎస్‌ ఆఫీసర్‌ అయితే, నలుగురికీ సేవ చేయగలుగుతావు. నువ్వు కోరుకుంటున్న సామాజిక మార్పు అప్పుడే సాధ్యం అవుతుంది’ అనేవారు నాన్న.

Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా ల‌క్ష్యాన్ని మాత్రం మరువ‌లేదు..

నా సివిల్స్ ప్రిప‌రేష‌న్‌లో..

మ‌న లక్ష్యంపై స్పష్టత ఉంటే సివిల్స్‌ సాధించడం కష్టమైన పని కాదని నా నమ్మకం. మనకు కావాల్సిన స‌బ్జెక్ట్ మెటీరియల్‌ ఏమిటన్నది ముందుగా ఎంపిక చేసుకోవాలి. మనం సలహాలు తీసుకునేవారు సరైన వారై ఉండాలి. తర్వాత, మనదగ్గర ఉన్న మెటీరియల్‌ను పూర్తిగా చదివేలా ప్రణాళిక వేసుకోవాలి. రెండు రోజులు చదివి విశ్రాంతి తీసుకుంటానంటే కుదరదు. అలాగని రోజంతా పుస్తకాలకు అతుక్కుపోవాల్సిన పనీలేదు. పక్కా ప్రణాళికతో క్రమం తప్పకుండా ప్రిపరేషన్‌ కొనసాగేలా చూసుకోవాలి. నేను రోజుకు ఆరేడు గంటలు మాత్రమే చదివేదాన్ని. వారాంతాల్లో కొంచెం ఎక్కువ సమయం ప్రిపేరయ్యేదాన్ని. ప్రిపరేషన్‌ సమయంలో ఫోకస్‌ పోకుండా చూసుకోవాలి.

IPS Success Story : ఎస్‌ఐ పరీక్షలో ఫెయిల్.. ఐపీఎస్ పాస్‌.. కానీ ల‌క్ష్యం మాత్రం ఇదే..

అప్పుడే విజయం సాధిస్తాం.. కానీ
జీవితం ఒక చాలెంజ్‌. కంఫర్ట్‌ జోన్‌లో ఉండాలనుకోవద్దు. అవకాశాలు సృష్టించుకుంటూ, మన శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవాలి. నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో అడుగుపెట్టాక అనుక్షణం కష్టపడ్డాను. ఈ ట్రైనింగ్‌లో ఎన్నో చాలెంజ్‌లు ఉంటాయి. ఒక ఐపీఎస్‌ అధికారిగా విధుల్లో చేరిన తర్వాత రకరకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని తట్టుకోవడమే కాదు, టీమ్‌ను ముందుండి నడిపించగల లీడర్‌గా ఎదగాలి. అప్పుడే విజయం సాధిస్తాం.

Civil Ranker Story: ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నా.. నాలుగు సార్లు ఫెయిల్ అయ్యా.. కానీ..

నిత్యం నన్ను నేను..

అకాడమీలో అడుగుపెట్టిన తర్వాత ఆడ, మగ అన్న తేడాలేం ఉండవు. అన్నిటిలో, అందరికీ సమాన శిక్షణ, సమాన అవకాశాలు ఉంటాయి. శిక్షకులు, అధికారులు చెబుతున్న విషయాలను పక్కాగా ఆచరిస్తూ, మనలోని నైపుణ్యాలు పెంచుకోవాలి. అకాడమీలోకి వచ్చిన కొత్తలో నేను కాస్త నెమ్మదిగా ఉండేదాన్ని. అధికారుల ప్రోత్సాహంతో రోజురోజుకూ పుంజుకున్నా. ట్రైనింగ్‌ విజయవంతంగా పూర్తి చేయాలనుకున్నా. బ్యాచ్ టాపర్‌గా నిలవాలన్న లక్ష్యం ఏమీ మొదట్లో పెట్టుకోలేదు. ట్రైనింగ్‌ సాగే కొద్దీ ఆత్మవిశ్వాసం పెరిగింది. మొదటిస్థానం కోసం పోటీ పడకుండా, నన్ను నేను ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలని శ్రమించాను. ఒకరోజు కష్టపడితే సరిపోదు. నిత్యం నన్ను నేను నిరూపించుకున్నాను. ఫైనల్‌గా బ్యాచ్‌ టాపర్‌గా నిలవడం సంతోషాన్నిచ్చింది.

UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

ఒక్కసారి ఖాకీ యూనిఫామ్‌ వేసుకున్న తర్వాత..

ఐపీఎస్‌ అధికారి పాత్ర ఒక సమస్యకో.. ఒక ప్రాంతానికో.. ఒక అంశానికో పరిమితం కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రజలకు ఏది అవసరమో అది ఇచ్చేందుకు కృషి చేయాలి. ఒకవైపు నేరాలను నియంత్రిస్తూనే, శాంతి భద్రతలను పరిరక్షించాలి. ఒక్కసారి ఖాకీ యూనిఫామ్‌ వేసుకున్న తర్వాత ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. బాధ్యతలూ పెరుగుతాయి. పోలీస్‌ యూనిఫామ్‌లో ఉన్న మహిళా అధికారి మరింతమంది యువతులకు, బాలికలకు ప్రేరణ అవుతుంది. అలా స్ఫూర్తినిస్తున్న మహిళా అధికారుల్లో నేనూ ఉండటం గర్వంగా ఉంది.

ఈ వృత్తి ఒక పెద్ద బాధ్యత. ఇందులో ఎంతో గౌరవం ఉంది. మరింత మంది యువతులు పోలీస్‌ సర్వీస్‌లోకి రావాలని కోరుకుంటున్నా. మహిళా అధికారుల సంఖ్య పెరిగితేనే స్త్రీ సాధికారతకు అవకాశాలు ఏర్పడతాయి.

Sumit Sunil IPS: డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూనే.. ఐపీఎస్‌ అయ్యానిలా..

#Tags