IPS Success Story : ఎస్‌ఐ పరీక్షలో ఫెయిల్.. ఐపీఎస్ పాస్.. కానీ లక్ష్యం మాత్రం ఇదే..
గతంలో.. ఎస్‌ఐ ఉద్యోగం సాధించాలనే తన కలను కొద్ది దూరంలోనే దూరమయ్యాడు. కానీ కుంగిపోకుండా ఇంకా మెరుగైన లక్ష్యాన్ని అతడు నిర్దేశించుకున్నారు. అయితే ఇప్పుడు ఆదే లక్ష్యసాధనతో ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ కొలువు కొట్టాడు. ఈ నేపథ్యంలో.. ఐపీఎస్ ఆఫీసర్ కొలువు సాధించిన సంకీర్త్ విజయ రహస్యం మీ కోసం..
కుటుంబ నేపథ్యం :
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గ్రామానికి చెందిన సంకీర్త్ తండ్రి బెల్లంపల్లి ఏరియాలో ఎక్స్‌ప్లోరేషన్ విభాగంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. ఈయన పేరు సిరిసెట్టి సత్యనారాయణ. తల్లి అనిత. తల్లి అనిత మథర్స్ కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఎడ్యుకేషన్ :
ఈయన పట్టణంలోని మథర్స్ కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. 2008 నుంచి 2010 వరకు ఇంటర్మీడియట్ హైదరా బాద్ శ్రీచైతన్యలో, 2013లో బీటెక్‌లో సివిల్ ఇంజనీరింగ్ కోర్సును ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశాడు.
UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాపర్ శృతి శర్మ.. సక్సెస్ సిక్రెట్ ఇదే..
కొన్ని సెకన్ల తేడాతో..మిస్ అయ్యా.. కానీ
పోలీస్ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో ఆయన పరీక్షలకు సిద్ధమయ్యారు. గతంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అయితే 800 మీటర్ల రేసును 160 సెకన్లలో క్లియర్ చేయాల్సి ఉండగా.. కొన్ని సెకన్ల తేడాతో విఫలమయ్యాడు. దీంతో ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరచుకొని మళ్లీ తన లక్ష్యం కోసం పోరాటం ప్రారంభించారు.
Sumit Sunil IPS: డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే.. ఐపీఎస్ అయ్యానిలా..
కుటుంబం కోసం..
కుటుంబానికి ఆర్థిక చేయూత అందించేందుకు కొన్నాళ్లు ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో మిషన్ భగీరథలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు.
ఉద్యోగం చేస్తూనే..
సంకీర్త్ పనివేళలు సాయంత్రం పారంభమయ్యేవి. దీంతో రోజూ ఉదయం 7.30 గంటలకు ఆఫీసుకు వెళ్లి యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు. ఇలా రోజంతా సివిల్స్ పరీక్షల కోసం సిద్ధమవూతునే.. గత అనుభవం నేపథ్యంలో ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టారు. అయితే సంకీర్త్‌కు విజయం వెంటనే వరించలేదు. యూపీఎస్సీ పరీక్షల ఆరో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. యూపీఎస్సీ పరీక్షలో సంకీర్త్ 330వ ర్యాంక్ సాధించారు.
Yaswanth Kumar Reddy, Civils 15th Ranker: సివిల్స్‌లో నా సక్సెస్‌కు కారణం ఇదే.. వీరు లేకుంటే..
తన తండ్రి కలను నేరవేర్చినందుకు..
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ సమయంలో క్రీడల్లో కూడా బాగా రాణించాడు. దీంతోపాటు వివిధ విభాగాల్లో కొన్ని పతకాలు కూడా సాధించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి పాసింగ్ అవుట్ అవుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారుల్లో 27 ఏళ్ల సంకీర్త్ ఒకరు. ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన సంకీర్త్‌ను తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. తనను ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలన్న తన తండ్రి కలను నేరవేర్చానని సంతోషంగా చెబుతున్నారు సంకీర్త్.
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
నేనూ మీ నుంచే వచ్చా.. కానీ ఇలా ప్లాన్ చేశా..
ఎస్‌ఐ ఉద్యోగానికి ప్రిపేరయ్యా. రాత పరీక్ష ఉత్తీర్ణుడినయ్యా. ఫిజికల్‌గా ఫిట్‌గా లేనన్నారు. ఆరో ప్రయత్నంలో సివిల్స్ సాధించా. ఐపీఎస్ శిక్షణలో అన్ని రకాల మెడల్స్ సొంతం చేసుకున్నా. నేను ఎంత ఫిట్‌గా ఉన్నానో అనేందుకు ఇదే ఉదాహరణ. అంత కసిగా ఉండాలి.
అపజయాల నుంచి విజయాలు సాధించాలి. కొందరికి త్వరగా సక్సెస్ వస్తుంది. కొందరికి ఆలస్యంగా వస్తుంది. కానీ ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ముందుగా సిలబస్‌ను సిద్ధం చేసుకుని మనతో పోటీ పడేవారికి అనుగుణంగా సన్నద్ధమవ్వాలి. ప్రతి సబ్జెక్టుకూ ఎంత టైమ్ పడుతుందో అంచనా వేసుకోవాలి. అవగాహన లేని సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి.
Success Story: ఈ లెక్కలే.. నన్ను 'ఐఏఎస్' అయ్యేలా చేశాయ్.. ఎలా అంటే..?