IPS Officer Success Story : ఈ యువ ఐపీఎస్‌.. అప్పట్లో పెద్ద సంచలన‌మే.. ఇప్ప‌ట్లో సంచలన‌మే.. ఎలా అంటే..

దయాగాడి దండయాత్ర అన్నట్టు.. చిన్న‌ప్పుడు నుంచి ఊహించని విజయాలతో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్న రవిసైనీ.
IPS Officer Dr.Ravi Saini Success Story

బాలీవుడ్‌ మెగా స్టార్‌ అమితాబ్ బచ్చన్ హోస్ట్  చేసిన  టాప్‌ గేమ్ షో  'కౌన్‌ బనేగా  కరోడ్‌పతి' టెలివిజన్ షో 2001లో రవి పెద్ద నేషనల్‌ సెన్సేషన్‌. కేవలం 14 సంవత్సరాలకే  కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్‌ని రవి మోహన్ సైనీ గెలుచుకున్నారు. 15 కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అప్పట్లో పెద్ద సంచలనం రేపాడు.

రవి విజయ పరంపర ఆగిపోలేదు. కేబీసీ జూనియర్ విజేత మాత్రమే కాదు, ఆ తరువాత డాక్టర్ అయ్యాడు.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి ఐపీఎస్ కొట్టి వార్తల్లో నిలిచాడు. 20 ఏళ్ల తర్వాత 34 ఏళ్ల వయసులో 2021లో గుజరాత్‌లో పోరుబందర్‌కి ఎస్పీగా బాధ్యతలు చేపట్టడంతో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.  ఊహించని విజయాలతో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్న రవిసైనీ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

ఎలాంటి కోచింగ్ లేకుండా సివిల్స్ కొట్టాడిలా..

కేబీసీ నాటికి రవి 10వ తరగతి చదువుతున్నాడు. మెగాస్టార్‌ అబితాబ్‌ని కలవాలన్న కలతో పాటు షోలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని తానే ఒక స్టార్‌గా నిలిచాడు. అప్పటికే మంచి విద్యార్థి.. ఎప్పుడూ టాపర్ అయిన రవిలో ఇది మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జైపూర్‌లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన రవి యూపీఎస్సీ ప్రిపరేషన్‌ కోసం ఎలాంటి కోచింగ్‌ తీసుకోకపోవడం మరో విశేషం.

☛➤ IPS Officer Success Story : ఎటువంటి కోచించి లేకుండానే.. సివిల్స్ కొట్టా.. ఐపీఎస్ అయ్యా.. కానీ

2012 లో మెయిన్స్‌ను క్లియర్ చేయలేకపోయాడు. దీంతో 2013లో, భారత తపాలా శాఖ ఖాతాలు, ఆర్థిక సేవలకు ఎంపికయ్యాడు. ఆ తరువాత మెడికల్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడే   యూపీఎస్సీ సివిల్స్ 2014లో జాతీయ స్థాయిలో 461 ర్యాంక్ సాధించాడు. తండ్రి నేవీ అధికారి స్ఫూర్తితోనే ఐపీఎస్‌లో చేరాడు డా.రవి మోహన్‌ సైనీ, ఐపీఎస్.

☛➤ Success Story: ఒక‌టి త‌ర్వాత ఒక‌టి... ఆరు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన హైద‌రాబాదీ కుర్రాడు... ఎలా సాధించాడంటే..

☛ UPSC Civils Ranker Akhila Success Story : ప్రమాదంలో చేయిని కోల్పోయా..ఒంటి చేత్తోనే.. పోరాటం.. సివిల్స్ కొట్టానిలా..

☛ Inspirational IAS Success Story : డబ్బు కోసం ఆ ప‌ని చేశా.. చివ‌రికి ఇలా చ‌దివి ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యానిలా.. కానీ..

☛ IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివ‌రికి..

#Tags