PNB Apprentice Jobs : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో అప్రెంటీస్‌ నియామకాలు.. ఈ నెల 28న పరీక్ష..!

బ్యాంకింగ్‌ రంగం.. కొలువులు, నియామకాల పరంగా కళకళలాడే రంగం. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు నిత్యం నియామకాలు చేపడుతున్నాయి..

ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్‌ రంగంలో కెరీర్‌ కోరుకునే వారికి అప్రెంటిస్‌ చక్కటి మార్గం చూపుతోంది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌.. మొత్తం 2,700 అప్రెంటీస్‌ల నియామకానికి త్వరలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. పీఎన్‌బీ అప్రెంటీస్‌ ఖాళీలు, ఎంపిక ప్రక్రియ, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ తదితర వివరాలు.. 

బ్యాంకింగ్‌ రంగంలో.. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో పని అనుభవం తప్పనిసరిగా మారుతోంది. ఇలాంటి కొలువులు సొంతం చేసుకోవడానికి అప్రెంటీస్‌షిప్‌ ద్వారా పొందిన అనుభవం ఉపయోగపడుతుంది. కాబట్టి బ్యాంకింగ్‌ కెరీర్‌ కోరుకునే వారు అప్రెంటీస్‌షిప్‌ శిక్షణ పొందడంమేలంటున్నారు నిపుణులు.

Posts at SAIL : సెయిల్‌–బిలాయ్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు..

అప్రెంటీస్‌ యాక్ట్‌ మేరకు
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసుకున్న యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నేషనల్‌ అప్రెంటీస్‌ యాక్ట్‌–1961కు అనుగుణంగా అప్రెంటీస్‌ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకోసం అభ్యర్థుల ఎంపికకు రాత పరీక్ష నిర్వహించనుంది. ఇందులో విజయం సాధించిన వారికి అప్రెంటీస్‌గా అవకాశం కల్పించి స్టయిపండ్‌ కూడా అందించనుంది.

మొత్తం 2,700 ఖాళీలు
పీఎన్‌బీ తాజా నోటిఫికేషన్‌ ప్రకారం–జాతీయ స్థాయిలో మొత్తం 2,700 అప్రెంటీస్‌ల నియామకం చేపట్టనుంది. రాష్ట్రాల వారీగా, ఆయా రాష్ట్రాల్లో జిల్లాల వారీగా అప్రెంటీస్‌ ఖాళీల సంఖ్యను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో.. ఏపీలో 27, తెలంగాణలో 34 అప్రెంటీస్‌ ట్రైనీ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

TS Lawcet Counselling: ఆగస్టు తొలివారంలో లాసెట్‌ కౌన్సెలింగ్‌!

అర్హతలు
➤    2024, జూన్‌ 30 నాటికి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
➤    వయసు: 2024, జూన్‌ 30 నాటికి 20–28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఆన్‌లైన్‌ రాత పరీక్ష
➤    పీఎన్‌బీ అప్రెంటీస్‌ ట్రైనీ నియామకాలను రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఖరారు చేస్తారు. ఆన్‌లైన్‌లో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో నాలుగు విభాగాలు (జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ అండ్‌ రీజనింగ్‌ ఆప్టిట్యూడ్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌) ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు చొ­ప్పున అడుగుతారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలతో 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం ఒక గంట.

Posts at ITBA : ఐటీబీపీ కేంద్రాల్లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

ప్రాంతీయ భాష పరీక్ష
పీఎన్‌బీ అప్రెంటీస్‌ నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు తాము ఎంచుకున్న ప్రాంతీయ భాష పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్షలో పొందిన మార్కు­లు, నిర్దేశిత కటాఫ్‌ ఆధారంగా మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు ప్రాంతీయ భాషలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న ప్రాంతీయ భాషను ఎంచుకోవాలి. నిర్దిష్టంగా ఒక రాష్ట్రంలోని పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆ రాష్ట్ర భాషలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రాంతీయ భాష పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే.. అప్రెంటీస్‌ ట్రైనీ­గా నియామకం ఖరారవుతుంది. నిర్దిష్టంగా ఒక ప్రాంతీయ భాషను ఎంచుకున్న అభ్యర్థులు.. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సులో సదరు భాషను అభ్యసించి ఉంటే వారికి ప్రాంతీయ భాష పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది.

మెడికల్‌ ఎగ్జామినేషన్‌
ఆన్‌లైన్‌ పరీక్ష, అదేవిధంగా ప్రాంతీయ భాష పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించి.. ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌­లో నిలిచిన అభ్యర్థులకు మెడికల్‌ టెస్ట్‌ నిర్వహించి అప్రెంటీస్‌ ట్రైనీగా నియామక పత్రం అందిస్తారు.

DSC 2024: కొలువు కొట్టాల్సిందే...! ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ ఉపాధ్యాయ ఖాళీలు ఇలా..

అప్రెంటీస్‌ ట్రైనీగా విధులు
అప్రెంటీస్‌ ట్రైనీగా నియమితులైన అభ్యర్థులు వారికి కేటాయించిన బ్రాంచ్‌లలో ఏడాది పాటు ట్రైనీగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సీనియర్‌ సిబ్బందికి సహకరించడం, అదేవిధంగా బ్యాంకింగ్‌ రంగంలో జరిగే కార్యకలాపాలకు సంబంధించిన బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఏడాది వ్యవధిలో రెండు వారాలు ప్రాథమిక శిక్షణ, 52 వారాలు ఆన్‌–జాబ్‌ ట్రైనింగ్‌ ఉంటుంది.

స్టయిఫండ్‌

అప్రెంటీస్‌గా నియమితులైన వారికి పీఎన్‌బీ స్టయిఫండ్‌ అందిస్తుంది. గ్రామీణ/సెమీ అర్బన్‌ బ్రాంచ్‌లలో నియమితులైన వారికి నెలకు రూ.10 వేలు; అర్బన్‌ బ్రాంచ్‌లలో నియమితులైన వారికి నెలకు రూ.12 వేలు; మెట్రో బ్రాంచ్‌లలో నియమితులైన వారికి నెలకు రూ.15 వేలు చొప్పున స్టయిఫండ్‌ ఇస్తారు.

Head Constable Posts : ఐటీబీపీలో 112 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. చివ‌రి తేదీ!

భవిష్యత్‌ అవకాశాలు
ప్రస్తుతం బ్యాంకులు నియామకాల్లో అనుభవం ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రధానంగా కోర్‌ బ్యాంకింగ్‌ విధుల విషయంలో అనుభవమే ప్రధాన ప్రాతిపదికగా నిలుస్తోంది. ప్రముఖ బ్యాంకులలో అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి బ్యాంకింగ్‌ సెక్టార్‌లో కొలువు అందుకోవడం సులభమని చెప్పొచ్చు. కాబట్టి పీఎన్‌బీలో అప్రెంటీస్‌ ట్రైనీలు భవిష్యత్తులో బ్యాంకింగ్‌ రంగంలో ఉజ్వల కెరీర్‌ అవకాశాలు సొంతం చేసుకునే వీలుంది. 

ముఖ్య సమాచారం
➤    ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీ: 2024, జూలై 28
➤    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.pnbindia.in/Recruitments.aspx

AP EAPCET Seat Allotment 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. ఏపీ ఈఏపీసెట్‌-2024 తొలి రౌండ్‌ సీట్ల కేటాయింపు.. ఈ లింక్ క్లిక్ చేయండి.. మీ కాలేజీని చెక్ చేసుకోండిలా..

రాత పరీక్షలో రాణించే మార్గం
అప్రెంటీస్‌ నియామకాల్లో భాగంగా నాలుగు విభాగాల్లో గంట వ్యవధిలో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షలో విజయానికి అభ్యర్థులు సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగించాలి.

జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌
ఈ విభాగంలో రాణించాలంటే.. తాజా బ్యాంకింగ్‌ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్‌ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన చట్టాలు,విధానాలు,రిజర్వ్‌ బ్యాంకు విధులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో..కరెంట్‌ అఫైర్స్,స్టాక్‌ జనరల్‌ నాలెడ్జ్‌ కోణంలోనూ..ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

R Krishnaiah: నిరుద్యోగ సమస్యపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలి

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
ఈ విభాగంలో.. ఇడియమ్స్, సెంటెన్స్‌ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, వన్‌వర్డ్‌ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. గ్రామర్‌కే పరిమితం కాకుండా.. జనరల్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్‌ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

రీజనింగ్‌/క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
ఇందులో అర్థమెటిక్‌ అంశాల(పర్సంటేజెస్, ని­ష్పత్తులు,లాభ–నష్టాలు, నంబర్‌ సిరీస్,బాడ్‌మాస్‌ నియమాలు)పై పూర్తిగా అవగాహన పొందేలా ప్రా­క్టీస్‌ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.

Medical Officer Posts : ఏఎఫ్‌ఎంఎస్‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

కంప్యూటర్‌ నాలెడ్జ్‌
ఈ విభాగంలో రాణించాలంటే.. కంప్యూటర్‌ ఆపరేషన్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ స్ట్రక్చర్, ఇంటర్నెట్‌ సంబంధిత అంశాలు, పదజాలంపై ఫోకస్‌ చేయాలి. కీ బోర్డ్‌ షాట్‌ కట్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్‌ డిస్క్‌ తదితర) గురించి తెలుసుకోవాలి.

కాన్సెప్ట్స్, ప్రాక్టీస్‌
ఆయా సబ్జెక్ట్‌లలోని కాన్సెప్ట్‌లపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా ఐబీపీఎస్‌ గత ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల ప్రశ్నలు అడిగే తీరుపై అవగాహన లభిస్తుంది. ప్రిపరేషన్‌ సమయంలోనే అభ్యసనంతోపాటు ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. దీంతో పరీక్షలో మెరుగైన ప్రతిభ కనబరిచి మెరిట్‌ లిస్ట్‌లో నిలిచే అవకాశాలు మెరుగవుతాయి. 

Community Science Course : ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో ఈ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

#Tags