Skip to main content

AP Model Junior College Admissions: మోడల్ స్కూల్ 'ఇంటర్' ప్రవేశాలకు దరఖాస్తులు

Application deadline is 22nd of this month AP Model Junior College Admissions News AP Model Junior College  Admission notice for first year intermediate
AP Model Junior College Admissions News

రొంపిచర్ల: మండలంలో వి.రెడ్డిపాలెంలోని ఏపీ మోడల్‌ జూనియర్‌ కాలేజిలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ బి.రవినాయక్‌ ఆదివారం తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయన్నారు.

ఆయా గ్రూపులకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా బోధన జరుగుతుందన్నారు. ఆడ పిల్లలకు హాస్టల్‌ వసతి సౌకర్యం ఉందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వచ్చిన మెరిట్‌ మార్కులు, ప్రభుత్వం వారి రిజర్వేషన్లు అనుసరించి సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు కాలేజీలో సంప్రదించాలని కోరారు.

Published date : 21 May 2024 10:43AM

Photo Stories