Skip to main content

Shriya Sai Success Story : ఈ విద్యార్థికి రూ.2.7 కోట్ల స్కాలర్‌షిప్‌.. ఇలా ప్లాన్ చేస్తే మీకైనా ఈజీనే..

లక్ష్య సాధనకు సంకల్ప బలం దండిగా ఉండాలి. విజయం దిశగా పయనించేందుకు అకుంఠిత శ్రమ తోడవ్వాలి. ఆ కోవకు చెందిన యువతియే మల్కాజిగిరి విష్ణుపురి కాలనీకి చెందిన లక్కప్రగడ నీలిమ కుమార్తె శ్రేయా సాయి.
Shri Sai 2.7 Crore Scholarship
Shri Sai 2.7 Crore Scholarship

అమెరికా మసాచుసెట్స్‌లోని ప్రఖ్యాత వెల్స్‌లీ కాలేజీలో 2022–26 వరకు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) కోసం రూ.2.7 కోట్ల (ఇండియన్‌ కరెన్సీ) స్కాలర్‌షిప్‌ ప్యాకేజీని సదరు యూనివర్సిటీ నుంచి ఆమె పొందడం గమనార్హం. ఈ నేప‌థ్యంలో ఈ విద్యార్థి స‌క్సెస్ స్టోరీ మీకోసం..

Inspiring Story: ఫంక్షన్స్‌లో మాపై ‘చిన్న చూపు’.. ఈ క‌సితోనే రూ.40 లక్షల ప్యాకేజీతో..

కుటుంబ నేప‌థ్యం :

Sai Family


నేను పుట్టింది.. పెరిగిందీ హైదరాబాద్‌లోనే. మల్కాజిగిరి విష్ణుపురి కాలనీ. అమ్మ నీలిమ. అమ్మమ్మ జానకీదేవి. నా విజయం వెనక అమ్మ, మామ‌లు, కజిన్ల సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి. అమెరికా వెళ్లి చదువుకుంటాను అన్నప్పుడు అమ్మ.. వద్దు అనకుండా.. నా వెన్ను తట్టి ప్రోత్సహించింది. ఆమె తోడ్పాటు వల్లే నేను అనుకున్నది సాధించగలిగాను. నా విజ‌యం వీరి పాత్ర ఎంతో కీల‌క‌మైంది.

Success Story: రూ.1.20కోట్ల ప్యాకేజీతో ప్ర‌ముఖ కంపెనీలో ఉద్యోగం..

ఎడ్యుకేష‌న్‌:
శ్రేయా సాయి సైనిక్‌పురిలోని భవన్స్‌లో పదో తరగతి, నల్లకుంటలోని డెల్టా కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివింది.

ఈ లక్ష్యం కోస‌మే..
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనే లక్ష్యంతో వెల్స్‌స్లీ కాలేజీని ఎంపిక చేసుకొని దరఖాస్తు చేసుకుంది. శ్రేయా సాయి ప్రతిభను గుర్తించిన మసాచుసెట్స్‌ యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్, సైకాలజీలో యూజీ చేయడానికి రూ.2.7 కోట్లు మంజూరు చేస్తూ మార్చి నెలలో సంబంధించిన పత్రాలను అందజేశారు. కాలేజీ ఫౌండర్‌ శ్రీకాంత్‌ మల్లప్ప, అకాడమీ డైరెక్టర్‌ భాస్కర్‌ గరిమెళ్లతో పాటు పాటా్నకు చెందిన గ్లోబల్‌ సంస్థ సీఈఓ శరత్‌ సహకారంతో వెల్స్‌లీ కళాశాలలో సీటు సాధించినట్లు శ్రేయా సాయి తెలిపింది. వచ్చే నెల ఆగ‌స్టులో ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్తున్నట్లు పేర్కొంది. వెల్లస్లీ  కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ లేదా సైకాలజీలో డిగ్రీ చదివే అవకాశాలున్నాయని, ఆ తర్వాత మాస్టర్స్‌ కూడా అమెరికాలో పూర్తి చేస్తానని తెలిపారు. ఎంఎస్‌ పూర్తయ్యా, స్టార్టప్‌ను ప్రారంభిస్తానన్నారు.

Job: శ్రీకాళహస్తి అమ్మాయికి రూ.40 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఎలా వ‌చ్చిందంటే..?

వీళ్ల‌ తోడ్పాటుతోనే.. 
పాఠశాల స్థాయి నుంచే వివిధ పోటీల్లో పాల్గొనే దాన్ని. స్వచ్ఛ భారత్‌ నిర్వహణకు తోటి విద్యార్థులతో గ్రూపు ఏర్పాటు చేశాను. కేబినెట్‌ మెంబర్‌గా ఉండేదాన్ని. అమ్మ నీలిమతో పాటు అమ్మమ్మ జానకీదేవి సహకారం ఎంతో ఉంది. ప్రత్యేక కార్యాచరణతో ఆన్‌లైన్‌ అసైన్‌మెంట్స్‌తో పాటు, సెమినార్స్‌లో పాల్గొనేదాన్ని. నా పట్టుదలే లక్ష్యాన్ని దరిజేరేలా చేసింది.  

గుమాస్తా.. కుతురికి జాక్‌పాట్ .. రూ.44 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం
      నా మటుకు నా కెరీర్‌ ప్లానింగ్‌ను పదో తరగతిలోనే మొదలుపెట్టాను. ఇంటర్లో ఏం చదవాలో, ఇంటర్‌ తర్వాత ఏ విదేశీ కాలేజీలో, ఎలాంటి కోర్సును ఎంచుకోవాలో ముందు నుంచే నాకు స్పష్టత ఉంది. 
ప్రతిష్ఠాత్మకమైన కాలేజీ కాబట్టే.. నేను వెల్లెస్లీ కాలేజీతో పాటు ఇంకొన్ని విదేశీ కాలేజీలకు కూడా అప్లై చేశాను. అయితే అన్నిటికంటే వెల్లెస్లీ కాలేజీ ప్రతిష్ఠాత్మకమైనది కాబట్టి దీనికే నా తొలి ప్రాధాన్యం. ఈ కాలేజీని 1870లో స్థాపించడం జరిగింది. సెవెన్‌ సిస్టర్స్‌ కాలేజీల్లో ఇదొకటి.

Inspiring Story: రైతు బిడ్డ‌కు జాక్‌పాట్‌.. రూ. 1.8 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం.. ఎక్క‌డంటే..?

నేను అస‌లు ఊహించలేదు..
ఎంతో మంది ప్రముఖ జర్నలిస్టులు, రాజకీయ వేత్తలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఈ కాలేజీలో చదువుకున్నారు. అలాగే ఈ కాలేజీలో చదువుతూనే వేరే కాలేజీల్లో క్రాస్‌ రిజిస్టర్‌ చేసుకుని, క్లాసులకు హాజరయ్యే సౌలభ్యం కూడా ఉంది. అలాంటి ప్రతిష్ఠాత్మక కాలేజీలో కేవలం సీటు దొరికితే చాలనుకున్న నాకు ఏకంగా 2.7 కోట్ల స్కాలర్‌షిప్‌ కాలేజీ ఆఫర్‌ చేయడం నా అదృష్టం. ఇది నేను ఊహించని విషయం. 

Inspiring Success Story: 18 ఏళ్లకే ప్ర‌భుత్వ ఉద్యోగం.. తల్లిదండ్రులు లేక‌పోవ‌డంతో..

నాకెంతో ఇష్టమైన..
స్కాలర్‌షిప్‌లో ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌, భోజన ఖర్చులతో పాటు, పుస్తకాలు, వ్యక్తిగత ఖర్చులు, విమాన టిక్కెట్ల ఖర్చులు కూడా కవర్‌ అవుతాయి. నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో భాగంగా నాకెంతో ఇష్టమైన కంప్యూటర్‌ సైన్స్‌, సైకాలజీ సబ్జెక్ట్స్‌ ఎంచుకున్నాను. ఈ నాలుగేళ్ల కాలంలో నేను ఇండియాకు వచ్చి వెళ్లడానికి అవసరమైన విమాన టిక్కెట్ల ఖర్చులు కూడా కాలేజీ స్కాలర్‌షిప్‌లో కలిసి ఉంటాయి.

Warren Buffett: కటిక పేదరికాన్ని చూశా.. ఆకలి కేకలు పెట్టా.. మీ గుడ్ ఫ్యూచర్‌కు నా సలహా ఇదే..

విదేశీ విద్యకు ఇలా ప్రణాళిక ఇలా చేస్తే..
ఈ పోటీ ప్రపంచంలో కెరీర్‌ డెవల్‌పమెంట్‌ ప్లానింగ్‌ ఎంతో ముందు నుంచే మొదలుపెట్టాలి. నేను ఇంటర్‌ చదివే సమయంలోనే  డెక్స్‌టరీ గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌లో కెరీర్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాంలో చేరాను. ఈ ప్రోగ్రాం ద్వారా విదేశీ కాలేజీలకు అప్లికేషన్‌ పెట్టే విధానాలు, విదేశీ చదువు విధానం, దాంతో పొందే ప్రయోజనాల గురించి నేర్చుకున్నాను. అలాగే ద‌ర‌ఖాస్తు ప్రక్రియలో కూడా డెల్టా కాలేజీ, డెక్స్‌టరీ గ్లోబల్‌ సహాయపడ్డాయి. అయితే సీటుతో పాటు స్కాలర్‌షిప్‌ కూడా పొందగలగడానికి, నేను ద‌ర‌ఖాస్తులో నింపిన వివరాలే కారణమని అనుకుంటున్నాను. ద‌ర‌ఖాస్తులో వ్యక్తిగత వివరాల్లో భాగంగా ఆర్థిక, కుటుంబ స్థితిగతులను కూడా వివరించవలసి ఉంటుంది. అలాగే కొన్ని వ్యాసాలను కూడా రాయాల్సి ఉంటుంది.

Job Opportunity: ప్ర‌ముఖ కంపెనీల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి ఉద్యోగం..శాల‌రీ ఎంతంటే..?

సాధారణంగా ఏ విదేశీ కాలేజీకి ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నా.., ద‌ర‌ఖాస్తు భర్తీ నిజాయితీగా సాగాలి. కాలేజీ యాజమాన్యానికి మన నిబద్ధత, పట్టుదల పట్ల నమ్మకం కలిగించాలి. సీటు పరంగా, స్కాలర్‌షిప్‌ పరంగా వేర్వేరు కాలేజీలు వేర్వేరు ప్రాధామ్యాలను అనుసరిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి వాకబు చేసి, పూర్వ విద్యార్థులను సంప్రదించి సలహాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

Success Story: పెట్టుబ‌డి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు.. ఇదే నా సక్సెస్ మంత్ర..

Published date : 20 Jul 2022 06:16PM

Photo Stories