Skip to main content

Inspiring Story: రైతు బిడ్డ‌కు జాక్‌పాట్‌.. రూ. 1.8 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం.. ఎక్క‌డంటే..?

ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బిడ్డ.. తండ్రి కష్టం చూసి కష్టపడి చదివాడు. ఆ కష్టం ఇప్పుడు ఫలించింది. భారీ ప్యాకేజీతో ఉద్యోగం దక్కింది. అదీ ఫేస్‌బుక్ కంపెనీలో ఉద్యోగం వ‌చ్చింది.
Bisakh Mondal Facebook
Bisakh Mondal has bagged a Rs 1.8 crore job at Facebook

తమ బిడ్డ సాధించిన ఘనతకు ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. కోల్‌కతా జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్ చివ‌రి సంవ‌త్స‌రం చదువుతున్న బిశాక్‌ మోండాల్‌కు.. భారీ ప్యాకేజీతో ఉద్యోగం వ‌చ్చింది.

Inspiring Story: ఫంక్షన్స్‌లో మాపై ‘చిన్న చూపు’.. ఈ క‌సితోనే రూ.40 లక్షల ప్యాకేజీతో..

కుటుంబ నేప‌థ్యం:

Bisakh Mondal


అతనిది ఒక సాదాసీదా రైతు కుటుంబం. బీర్‌భూమ్‌లోని రామ్‌పూర్‌హట్‌లో ఉంటోంది అతని కుటుంబం. తండ్రి రైతుకాగా.. తల్లి అంగన్‌వాడీ వర్కర్‌. తమ బిడ్డను తమను గర్వపడేలా చేశాడని ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవ‌ధులు లేవు.

IT Jobs: పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న టాప్ ఐటీ కంపెనీలు ఇవే..!

Success Story: రూ.1.20కోట్ల ప్యాకేజీతో ప్ర‌ముఖ కంపెనీలో ఉద్యోగం..

గూగుల్‌, అమెజాన్‌ నుంచి కూడా ఆఫర్లు.. కానీ

Bisakh Mondal Facebook Job


బిశాఖ్‌ సెప్టెంబర్‌లో లండన్‌లోని ఫేస్‌బుక్‌లో జాయిన్‌ కాబోతున్నాడు. కోటి 80 లక్షల రూపాయల ప్యాకేజ్‌. అయితే ఫేస్‌బుక్‌ కంటే ముందు అతనికి గూగుల్‌, అమెజాన్‌ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. ప్యాకేజీ ఎక్కువగా ఉండడంతో ఫేస్‌బుక్‌ వైపు మొగ్గు చూపించినట్లు తెలిపాడు.గతంలో కోటి కంటే ఎక్కువ జీతంతో తొమ్మిది మంది జేయూ విద్యార్థులు ఈ ఘనత సాధించగా.. ఆ అందరిలోకెల్లా హయ్యెస్ట్‌ ప్యాకేజీ దక్కించుకుంది మాత్రం బిశాఖ్‌ కావడం గమనార్హం.

Job: శ్రీకాళహస్తి అమ్మాయికి రూ.40 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఎలా వ‌చ్చిందంటే..?

Job Opportunity: ప్ర‌ముఖ కంపెనీల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి ఉద్యోగం..శాల‌రీ ఎంతంటే..?

Published date : 27 Jun 2022 04:12PM

Photo Stories