Skip to main content

IT Jobs: పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న టాప్ ఐటీ కంపెనీలు ఇవే..!

కరోనా కొంత మంది ఉద్యోగాలు ఊడేలా చేస్తే.. ఫ్రెషర్స్‌కు మాత్రం బంపరాఫర్‌ ఇస్తోంది. మా ఆఫీస్‌లో జాయిన్‌ అవ్వండి.
IT Jobs
IT Jobs

మీ టాలెంట్‌కు తగ్గట్లు ప్యాకేజీ ఇస్తాం. కాదు..కూడదు అంటే అంతకంటే ఎక్కువ ఇస్తాం అంటూ దిగ్గజ సంస్థలు పిలిచి మరి ఉద్యోగాలిస్తున్నాయి. కానీ ఫ్రెషర్స్‌, ప్రస్తుతం ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఆ ఆఫర్‌లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. అందుకు కారణం ఏంటీ? అసలు ఐటీ కంపెనీల  లోపల ఏం జరుగుతుంది.  

కాదు.. కూడదు అంటే అంతకంటే ఎక్కువ ఇస్తామంటూ..
మా ఆఫీస్‌లో జాయిన్‌ అవ్వండి. మీ టాలెంట్‌కు జీతాలిస్తాం. కాదు..కూడదు అంటే అంతకంటే ఎక్కువ ఇస్తామంటూ దిగ్గజ ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్‌కు పిలిచి మరి ఉద్యోగాలిస్తున్నాయి. దీంతో పాటు హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఫెసిలీటీతో పాటు ఇంకా మరెన్నో ఆఫర్లు అందిస్తున్నాయి. కానీ ఆఫర్‌ లెటర్‌లు అందుకున్న ఫ్రెషర్స్‌ సైతం.. ఆ ఆఫర్లను వద్దనుకుంటున్నారు. అందుకు కారణం అప్‌డేట్‌ అవుతున్న టెక్నాలజీయేనని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. రోజు రోజుకీ పుట్టుకొస్తున్న కొత్త కొత్త టెక్నాలజీ కోర్స్‌లు నేర్చుకొని స్టార్టప్‌లలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కోవిడ్‌ సమయంలో విధించిన నిబంధనలు, అప్‌డేట్‌ అవుతున్న టెక్నాలజీల వల్ల తలెత్తే ఇబ్బందులు, జీతాల వంటి ఇతర కారణాల వల్ల చేస్తున్న ఉద్యోగాలకు గుడ్‌ బై చెబుతున్నారు.స్టార్టప్స్‌లో  చేరుతున్నారు. 

టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌తో పాటు..

TCS


ఈ సందర్భంగా ఇన్ఫోసిస్‌ సీఓఓ ప్రవీణ్‌ రావ్‌ మాట్లాడుతూ..ఉద్యోగుల నిర్ణయాన్ని బట్టి వారికి నచ్చేలా ఉద్యోగాలు, ప్రమోషన్‌లు, జీతాలతో.. స్టార్టప్‌లు,యూనికార్న్‌ సంస్థలు ఆకర్షిస్తున్నాయి. అంతెందుకు యూనికార్న్‌ కంపెనీలు సైతం మా కంపెనీ(ఇన్ఫోసిస్‌) ఉద్యోగులకు అవకాశం ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయని ప్రవీణ్‌ రావు అన్నారు.కాబట్టే టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌తో పాటు ఇతర దిగ్గజ కంపెనీలు భారీ ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తూ ఫ్రెషర్స్‌ను నియమించుకుంటూనే..అట్రిషన్‌ రేట్‌ తగ్గించుకునేందుకు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్‌లు ఇస్తున్నాయి.  

కారణం ఇదే.. 
కరోనా కారణంగా దేశంలో డిజిటల్‌ ట్రాన్సర్మేషన్‌ అంటే చేసే బిజినెస్‌, కల్చర్‌, కొత్త ప్రాజెక్ట్‌లను దక్కించుకునేందుకు కావాల్సిన మార్కెట్‌ రిక్వైర్‌ మెంట్స్‌ మారిపోయాయి. దీంతో సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం మార్కెట్‌లో వస్తున్న కొత్త కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కోర్స్‌లు నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉన్నా..వారికి నచ్చిన జాబ్‌లో జాయిన్‌ అవుతున్నారు. కాబట్టే ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి టెక్‌ కంపెనీలలో ఉద్యోగులు కొరత తీవ్రంగా వేధిస్తోంది. 

ఉద్యోగుల జీతాల్ని భారీ ఎత్తున..

IT


గత ఆర్థిక సంవత్సరానికిగాను నాలుగో త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. మూడో త్రైమాసికం 25.5 శాతంతో పోల్చితే నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు 27.7 శాతానికి పెరిగింది. అట్రిషన్‌ రేట్‌ తగ్గించేందుకు ఈనెల నుంచి ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల జీతాల్ని భారీ ఎత్తున పెంచనుంది. ఇక ఇక గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 85,000 మంది ఫ్రెషర్లను నియమించుకోగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50,000 మందిని నియమించుకోనేందుకు ఇన్ఫోసిస్‌ చూస్తోంది. 

టీసీఎస్‌ 1.03లక్షల మందిని..
ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2022లో టీసీఎస్‌ 1.03లక్షల మందిని..మూడు నెలల్లో ఎక్కువ మంది నియమించుకుంది. దీంతో మొత్తం 6లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇటీవ‌లే ఓ అమ్మాయికి.. రూ.40 లక్షల వేత‌నంతో..

షేక్‌ షామిలి


ఓ సాధారణ ముస్లిం కుటుంబానికి చెందిన షేక్‌ షామిలి స్వయంకృషితో మంచి ఉద్యోగం సాధించింది. చిన్నతనం నుంచే చదువలో దిట్ట. ఈమె శ్రీవిద్యానికేతన్‌లో బీటెక్‌ ఈసీ చదివారు. తృతీయ సంవత్సరంలోనే ఆమెకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చెన్నైలోని టీసీఎస్‌లో అవకాశం లభించింది. ఈ క్రమంలో ఈమె ప్రతిభను గుర్తించిన ‘వాల్‌మార్ట్‌’ ఆమెను సీనియర్‌ మేనేజరుగా నియమిస్తూ .. నియామకపత్రం పంపింది. సంవత్సరానికి రూ.40 లక్షలు వేతనం.

రూ.44 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం..

 బీటెక్‌ చదువుతుండగానే ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో భారీ ఆఫర్‌ను చేజెక్కించుకుందో విద్యార్థిని.
స్నేహకిరణ్‌
 

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సింహాచలం, సుభాసితిల కుమార్తె కొంచాడ స్నేహకిరణ్‌ అనే విద్యార్థిని విశాఖపట్నంలోని అనిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది.

గుమాస్తా కూతురు..
ఈ కళాశాలలో అమెజాన్‌ సంస్థ 2021 డిసెంబర్‌లో క్యాంపస్‌ సెలక్షన్‌ నిర్వహించింది. అందులో స్నేహకిరణ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఏడాదికి రూ.44 లక్షల జీతంతో ఉద్యోగం సాధించింది. ఇదిలా ఉండగా, విద్యార్థిని తండ్రి జీడిపప్పు పరిశ్రమలో గుమాస్తాగా పనిచేస్తున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని స్నేహకిరణ్‌ నిరూపించింది. కూతురు సాధించిన విజయంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Job Opportunity: ప్ర‌ముఖ కంపెనీల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి ఉద్యోగం..శాల‌రీ ఎంతంటే..?

​​​​​​​ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు
వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట పండింది. ఏడాదిలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు.ప్రముఖ కంపెనీలో అత్యధిక ప్యాకేజీ ఏడాదికి 62 లక్షల 50 వేల వేతనంతో ఉద్యోగం పొందిన విద్యార్థులు ఎన్ఐటీకి చెందిన వారే కావడం విశేషం. వరంగల్ ఎన్ఐటీ మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల గేట్ 2022 లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఘనత ఎన్ఐటి విద్యార్థికే దక్కగా తాజాగా ఏడాదిలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొంది సరికొత్త రికార్డు సృష్టించింది. క్యాపస్ డ్రైవ్ ద్వారా 250 కంపెనీల్లో 630 మంది బీటెక్ విద్యార్థులు, 386 మంది పిజి విద్యార్థులు ఉద్యోగాలు పొందారని ఎన్ఐటీ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు.‌ మరో 50 మంది విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొందారని చెప్పారు.

సగటున 14.5లక్షల ప్యాకేజీతో..
2019-20 సంవత్సరంలో 792 మంది  2020-21లో 839 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందితే ఈసంవత్సరం ఇప్పటి వరకు 1016మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారిలో అత్యధికంగా ఏడాదికి 62 లక్షల 50 వేల వేతనంతో గౌరవ్ సింగ్, ప్రియాంష్ మహేశ్వరి దెశహ్ కంపెనీలో పని చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారిలో సగటున 14.5లక్షల ప్యాకేజీ లభించిందని డైరెక్టర్ ప్రకటించారు.

నెలకు 20 వేల నుంచి లక్ష అరవై వేల వరకు స్టైఫండ్..
450 కంటే ఎక్కువ మంది ఫ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు వివిధ కంపెనీల నుంచి ఇంటర్న్‌షిప్‌ ఆఫర్ పొందారని, నెలకు 20 వేల నుంచి లక్ష అరవై వేల వరకు స్టైఫండ్ వస్తుందని తెలిపారు. ప్రభావంతో క్యాంపస్ ఇంటర్వ్యూలు అనుకున్నన్ని జరగకపోయినా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు లభించడం  హర్షనీయమని, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయని డైరెక్టర్ ఎన్వీ రమణ రావు స్పష్టం చేశారు.

Published date : 20 Apr 2022 07:29PM

Photo Stories