Inspiring Mother and Daughter: తల్లికి తగిన కూతురు.. అందరికీ ఆదర్శంగా వీరి ప్రయాణం
సాక్షి ఎడ్యుకేషన్: కొత్తకోట గ్రామానికి చెందిన టీచర్ పి.వి.ఎం.నాగజ్యోతి ఎమ్మెస్సీ ఎంఏ బీఈడీ చేశారు. రావికమతం మండలంలోని కన్నంపేట స్కూల్లో పనిచేసి ఇటీవల రోలుగుంట హైస్కూల్‌కు బదిలీ అయ్యారు. బోధనలో ఎన్నెన్నో మెళకువలు నేర్చుకున్నారు. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ కోర్స్‌కు రాష్ట్రం నుంచి ఎంపికై బెంగళూరులో శిక్షణ పొందారు. ఉత్తమ బోధనతో పాటు తన సొంత ఖర్చుతో పది మందికి సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Development of Digital Revolution: మొదలుకానున్న డిజిటల్ విప్లవం..
విద్యా బోధనలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా జిల్లా కలెక్టర్ రవిపటాన్‌శెట్టి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. నెల నెలా తనకొచ్చే జీతంలో కొంత మొత్తం వెచ్చించి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కొత్తకోట గ్రంథాలయానికి రూ.20 వేల విలువైన పుస్తకాలు అందించారు. పేద విద్యార్థులకు పలుమార్లు దుస్తులు, స్టడీ మెటీరియల్ అందించారు. కరోనా సమయంలో ఎన్నో కుటుంబాలు, పోలీసులకు, ఆరోగ్య సిబ్బందికి పలు సహాయాలను అందించి అందరి మన్ననలు పొందారు. ఆమె అందిస్తున్న సేవలకు వాసవీ క్లబ్, రాష్ట్ర నాయకులు, అధికారుల చేతుల మీదుగా ఎన్నో సన్మానాలు పొందారు. ఉపాధ్యాయినిగానే కాదు క్రీడల్లోనూ ప్రతిభ చూపి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఔరా అనిపిస్తున్నారు.
Teaching Posts: త్వరలో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇదే!
నేపాల్‌లో ఈ నెల 5 నుంచి 10 వరకూ జరిగిన అంతర్జాతీయ పోటీల్లో నాలుగు పతకాలు సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించారు. పవర్ లిఫ్టింగ్, రన్నింగ్ పోటీల్లో బంగారు పతకాలు, డిస్కస్ త్రో, జావలిన్ త్రోలో రజత పతకాలు సాధించారు. గతంలో పలుమార్లు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. నాగజ్యోతి భర్త సర్వేశ్వరరావు మెడికల్ ఏజెంట్‌గా పనిచేస్తుంటారు.
NAS Survey for Students: విద్యార్థులకు నాస్ నిర్వహించే సర్వే పరీక్షలు
తల్లికి తగ్గ తనయ సాహితి
నాగజ్యోతి కుమార్తె సాహితి విద్యాభ్యాసంలో మంచి ప్రతిభ చూపుతోంది. దువ్వాడ విజ్ఞాన్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న సాహితి చిన్ననాటి నుంచి మెరిట్ స్టూడెంట్.
చిన్ననాటి నుంచి ఈతపై కూడా ఆమెకు మక్కువ. అనకాపల్లి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోనూ, అనకాపల్లి అబ్దుల్ కలాం ఆర్గనైజేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలో పలుమార్లు విజేతగా నిలిచింది. బంగారు పతకాలు సాధించింది. నీటిపై తేలుతూ ఎన్నో విన్యాసాలను, యోగాసనాలను సాహితి అవలీలగా వేస్తోంది.
Admission in NIMS Hyderabad: నిమ్స్ హైదరాబాద్‌లో సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశాలు
సాహస బాలిక..
నాలుగేళ్ల క్రితం పూడిమడక సముద్రతీరానికి వెళ్లిన సాహితి అక్కడ పెద్ద సాహసమే చేసింది. సముద్రంలో ప్రమాదవశాత్తూ అలల్లో చిక్కుకున్న ఇద్దరు బాలురను కాపాడి సాహస బాలికగా గుర్తింపు తెచ్చుకుంది. జాతీయ ఉత్తమ జీవన్ రక్ష ప్రెసిడెంట్ అవార్డు పొందింది. దేశంలో 8 రాష్ట్రాలకు చెందిన 8 మంది సాహస బాలికలను ఈ అవార్డుకు ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సాహితిని భారత ప్రభుత్వం ఎంపిక చేసింది.
Skill Test for IERP: సమగ్రశిక్ష కార్యాలయంలో నైపుణ్య పరీక్షలు
2022 జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా అప్పటి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డును స్వీకరించింది. అవార్డుతో పాటు రూ.60వేల నగదు బహుమతి, మెడల్, షీల్డ్ స్వీకరించింది. దీనిని గుర్తిస్తూ సాహితికి లైఫ్‌సేవింగ్ యాక్టు ప్రకారం స్పెషల్ మెరిట్ సర్టిఫికెట్‌ను సైతం అప్పటి విశాఖ కలెక్టర్ మల్లికార్జున చేతుల మీదుగా అవార్డును సాహితి అందుకుంది. కుగ్రామంలో జీవిస్తూ విశిష్ట సేవలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చిన తల్లీకూతుళ్లు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.