Skip to main content

NAS Survey for Students: విద్యార్థుల‌కు నాస్ నిర్వ‌హించే స‌ర్వే ప‌రీక్ష‌లు

విద్యార్థుల సామ‌ర్థ్యం, ఉపాధ్యాయులు అందించే శిక్ష‌ణను ప‌రిశీలించేందుకు నాస్ స‌ర్వే నిర్వ‌హిస్తున్నట్లు తెలిపారు. ఈ ప‌రీక్ష‌లు ప్ర‌తీ మూడు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి నిర్వ‌హిస్తారు..
Students of government schools,NAS Student Ability Survey,Teacher Training Evaluation
Students of government schools

ఎంపిక చేసిన పాఠశాలల్లో...

ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో సర్వే నిర్వహిస్తారు. 3, 6, 9 తరగతుల విద్యార్థులకు పరీక్ష జరుగుతుంది. 3వ తరగతి విద్యార్థులకు అదే తరగతికి సంబంధించిన సిలబస్‌, 6వ తరగతి విద్యార్థులకు 5వ తరగతికి సంబంధించిన సిలబస్‌, 9వ తరగతికి విద్యార్థులకు 8వ తరగతి సిలబస్‌పై పరీక్ష ఉంటుంది. 3, 6 తరగతులు విద్యార్థులకు లాంగ్వేజ్‌, గణితం, ఈవీఎస్‌, 9వ తరగతి విద్యార్థులకు లాంగ్వేజ్‌, గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టుపై పరీక్షలు నిర్వహిస్తారు.

Supreme Court: ఎంబీబీఎస్‌ విద్యార్థులకు స్టైపెండ్‌ చెల్లించండి

3, 6 తరగతులవారికి 40 ప్రశ్నలకు 60 నిమిషాల సమయం, 9వ తరగతి విద్యార్థులకు 60 ప్రశ్నలకు 90 నిమిషాల వ్యవధిలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. జిల్లాలో 552 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన ఫలితాలు (లెర్నింగ్‌ అవుట్‌కమ్స్‌)ఆధారంగా అభ్యసనా సామర్థ్యాలు మదింపు చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు డిగ్రీ చదువుతున్న 607 మంది ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్ల (ఎఫ్‌ఐ)ను ఎంపిక చేస్తారు. వీరికి జిల్లాస్థాయి కోఆర్డినేటర్ల ద్వారా శిక్షణ అందిస్తారు. ప్రతి శనివారం అన్ని యాజమాన్య పాఠశాలల్లో ప్రత్యేక ప్రాక్టిస్‌ పరీక్షలు చేపట్టి విద్యార్థులను సిద్ధం చేయాల్సి ఉంటుంది.

పాలకొండ రూరల్‌:

విద్యార్థుల ఉజ్వలభవితే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర‌ ప్రభుత్వాలు విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టాయి. ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థాలను తరగతి వారీగా మదింపు చేసే ప్రక్రియ నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఏఎస్‌–నాస్‌)ను వచ్చేనెల 3వ తేదీ నుంచి నిర్వహించనున్నాయి. ప్రతి మూడేళ్లకోసారి నాస్‌ సర్వే నిర్వహిస్తాయి. చివరగా 2021లో జరిపాయి. తాజాగా 2024లో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశాయి. దీని ఆధారంగా విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని అంచనావేసి, విద్యాప్రణాళికలు అమలుచేస్తాయి. నాస్‌ సర్వేకు ముందుకు స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ సర్వేను మండల స్థాయిలో చేపట్టనున్నాయి.

Karate Competitions: క‌రాటే పోటీల్లో బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థి

ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్ల ఎంపిక

స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(సీస్‌)లో భాగంగా క్షేత్ర స్థాయిలో పరీక్ష నిర్వహించేందుకు ఆయా మండలాలకు ఎంత మంది ఎఫ్‌ఐలు అవసరమనేది జిల్లా విద్యాశాఖ నిర్ధారణకు వచ్చింది. ఎఫ్‌ఏఐలుగా ఛాత్రోపాధ్యాయులు, డిగ్రీ చదువుతున్న విద్యార్థులను నియమించి శిక్షణ ఇవ్వనుంది. సర్వే పరీక్ష వీరి పర్యవేక్షణలోనే జరుగుతుంది. జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో జరగనున్న పరీక్షలను డీసీఈబీ సెక్రటరీ, సమగ్ర శిక్ష ఏఎంఎ, డైట్‌ ప్రిన్సిపాల్‌/లెక్చరర్‌, డీఈఓ కార్యాలయ ప్రతినిధి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ పరిశీలిస్తారు.

Teaching Posts: త్వరలో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇదే! 

మండల స్థాయిలో పరీక్షల నిర్వాహకులుగా మండల విద్యాశాఖాధికారులు 1, 2తో పాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు వ్యవహరిస్తారు. ఈ పరీక్షకు ముందుగా విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ అధ్వర్యంలో ప్రాక్టీస్‌ పరీక్షల ద్వారా ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాల్సి ఉంది. గతంలో నిర్వహించిన సర్వేలో భాగంగా మూడు, ఐదు, ఎనిమిది తరగతులకు పరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది సీస్‌ సర్వేలో 3, 6, 9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Admission in NIMS Hyderabad: నిమ్స్‌ హైదరాబాద్‌లో సర్టిఫికేట్‌ కోర్సులో ప్రవేశాలు

ఎస్‌సీఈఆర్‌టీ నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లోనే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. వీటి నిర్వహణకు ఎస్‌సీఈఆర్‌టీ ముందుగా సరఫరా చేసిన ప్రాక్టీస్‌ పేపర్లతో తర్ఫీదు ఇస్తారు. తద్వారా సీస్‌ పరీక్షలను విద్యార్థులు సమర్ధవంతంగా రాసే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. 3, 6 తరుగతుల విద్యార్థులకు తెలుగు/ఇంగ్లిష్‌, గణితం, పరిసరాల విజ్ఞానం, 9వ తరగతి విద్యార్థులకు తెలుగు/ఇంగ్లిష్‌, గణితం, సోషల్‌, సైన్స్‌ సబ్జెక్టులపై పరీక్ష నిర్వహిస్తారు.

Published date : 18 Oct 2023 09:50AM

Photo Stories