Karate Competitions: కరాటే పోటీల్లో బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థి
సాక్షి ఎడ్యుకేషన్: మండలంలో తాజంగి పంచాయతీ టి.కోరుకొండ గ్రామానికి చెందిన ఓ గిరిజన విద్యార్థి రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో బ్లాక్‌బెల్ట్ సాధించాడు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో ఈనెల 13 నుంచి 16 తేదీల వరకు గ్రాండ్ మాస్టర్ రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంగ్‌ఫూ, కరాటే పోటీల్లో విద్యార్థి పాల్గొని బ్లాక్‌బెల్ట్ సాధించాడు.
MBBS Stipend: విద్యార్థులకు ఎన్ఎంసీ చెల్లించాల్సిన స్టైపెండ్
చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన కొర్ర మహేష్ ఆరేళ్లుగా స్థానిక కోచ్ సూర్యవరపు జగన్మోహన్ వద్ద కరాటే శిక్షణ పొందుతున్నాడు. ఇప్పటికే గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, బ్రౌన్ బెల్టులు సాధించాడు. ఈ సందర్భంగా కోచ్ జగన్మోహన్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థి మహేష్ పట్టుదలతో కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బ్లాక్‌బెల్ట్ సాధించడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థినులకు కూడా కరాటే శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.