Skip to main content

MBBS Stipend: విద్యార్థుల‌కు ఎన్ఎంసీ చెల్లించాల్సిన స్టైపెండ్

చాలామంది ఎంబీబీఎస్ విద్యార్థుల‌కు ఎన్ఎంసీ స్టైపెండ్ చెల్లించడంలేద‌ని విద్యార్థులు సుప్రీంకోర్టులో దాఖ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలోనే కోర్టు విచార‌ణ‌ చేప‌ట్టి తీర్పును జారీ చేసింది.
Legal action over unpaid MBBS student stipends, NMC's failure to pay stipends to MBBS students,Supreme Court orders NMC for MBBS Students stipend, Supreme Court investigation into NMC stipend issue
Supreme Court orders NMC for MBBS Students stipend

దేశంలో 70 శాతం వైద్య కళాశాలలు ఎంబీబీఎస్‌ విద్యార్థులకు సక్రమంగా స్టైపెండ్‌ చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) ఏం చేస్తోందని నిలదీసింది.

MBBS seats: MBBS సీట్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఇదే...

స్టైపెండ్‌ చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ విద్యార్థుల నుంచి భారీగా డొనేషన్లు, క్యాపిటేషన్‌ ఫీజులు వసూలు చేస్తుంటాయని పేర్కొంది. ఎంబీబీఎస్‌ విద్యార్థులు నిర్బంధ కార్మికులు కాదని తేల్చిచెప్పింది. వారికి తక్షణమే స్టైపెండ్‌ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎంసీని ఆదేశించింది.

Published date : 17 Oct 2023 12:46PM

Photo Stories