Skip to main content

MBBS seats: MBBS సీట్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఇదే...

MBBS seats
MBBS seats

నర్సంపేట: రాష్ట్రంలో ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్‌ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. నర్సంపేటలో రూ.180 కోట్లతో చేపట్టిన వైద్య కళాశాల నిర్మాణానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్య వతిరాథోడ్‌, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.

పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రొసీడింగ్‌ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో రెండు కళాశాలలు వస్తే.. తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో 29 మెడికల్‌ కళాశాలలు మంజూరయ్యాయని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు మెడికల్‌ కాలేజీ వస్తుందని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశానికి ధాన్యాగారంగా మారిందని, 10 రాష్ట్రాలకు అన్నం పెడుతోందని వివరించారు. కాంగ్రెస్‌ హయాంలో వలసలు, ధర్నాలు, అరెస్టులతో పరిస్థితి దుర్భరంగా ఉండేదని, ఝూటా మాటల కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మొద్దని సూచించారు. గోదావరి జిలాలు నర్సంపేటకు తీసుకొచ్చిన గొప్ప మనసున్న వ్యక్తి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అని కొనియాడారు. గతంలో పొన్నాల లక్ష్మయ్య ఉత్త జీఓను తీసుకొచ్చి, సీట్ల పంపకాలు చేపట్టి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు.

కాంగ్రెస్‌ పార్టీకి గ్యారంటీ లేదని, గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామనడం హా స్యాస్పదం అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ ఖాయమని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎల్‌కేజీ ఫీజు కంటే మెడికల్‌ కళాశాలలో ఫీజు తక్కువగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Published date : 29 Sep 2023 07:44PM

Photo Stories