Development of Digital Revolution: మొదలుకానున్న డిజిటల్ విప్లవం..
సాక్షి ఎడ్యుకేషన్: ధురవాడలోని హిల్ నం.4లో డిజిటల్ విప్లవం మొదలుకానుంది. ఇది కేవలం విశాఖకు.. రాష్ట్రానికి.. దేశానికి మాత్రమే కాదు.. యావత్ ఆసియా దేశాలకు పెద్దన్నగా మారనుంది. ప్రముఖ అదానీ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఈ డేటా సెంటర్, టెక్నాలజీ బిజినెస్ సెంటర్.. 190 ఎకరాల్లో రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో నిర్మితమవుతోంది. ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి రానుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
Skill Test for IERP: సమగ్రశిక్ష కార్యాలయంలో నైపుణ్య పరీక్షలు
దీంతో పాటు సింగపూర్ నుంచి ప్రత్యేక సబ్‌మైరెన్ కేబుల్ వేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సాంకేతికత రాజ్యమేలుతున్న నేపథ్యంలో.. డేటా స్టోరేజ్ పెంచడం, డిజిటలైజేషన్ విస్తరించడం, డేటా వేగం పెరగడం.. ఇలా విభిన్నమైన ప్రయోజనాలు అందించే ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ పరిశ్రమలు విశాఖకు క్యూ కట్టనున్నాయి. ఫలితంగా మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉత్తరాంధ్ర యువతకు రానున్నాయి.