Digital Teaching: బోధన సమయంలో ఉపాధ్యాయులు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించాలి.
భీమవరం: విద్యావిధానంలో సెంట్రల్ సిలబస్‌లో జరిగే మార్పులకు అనుణంగా ప్రతి ఉపాధ్యాయుడు నిత్యం విద్యార్థిగా అవగాహన పెంచుకుని బోధన చేస్తేనే విద్యార్థులు ఉన్నతులుగా తయారవుతారని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. సెంట్రల్ సిలబస్‌లో జరిగే మార్పులపై భీమవరంలోని భారతీయ విద్యా భవన్స్ స్కూల్‌ల్లో సోమవారం నిర్వహించిన శిక్షణా తరగతుల ప్రారంభం సభలో ఆయన మాట్లాడారు.
UGC: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై యూనివర్సిటీల్లొ రెండుసార్లు అడ్మిషన్లు
సెంట్రల్ సిలబస్ డిప్యుటీ కమిషనర్ డీటీ సుదర్శన్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్పు చెందుతున్న టెక్నాలజీని ఉపాధ్యాయులు ఉపయోగించి డిజిటల్ టీవీ, డిజిటల్ బోర్డుల ద్వారా పాఠాలు బోధిస్తే విద్యార్థులు కుతూహలంగా వింటారని, దీంతో వారికి బోధన అర్ధమై విద్యాపరంగా అభివృద్ధి చెందుతారన్నారు. సెంట్రల్ సిలబస్ సీనియర్ రీసోర్స్ పర్సన్ నిట్టల పార్థసారథి మాట్లాడుతూ విద్యార్థులకు ఆల్‌రౌండ్ డవలప్‌మెంట్ రావాలంటే రోజంతా చదివిస్తే చదువు రాకపోగా సైకాలజీ సమస్యతో చదువుపై విరక్తి చెందే అవకాశం ఉందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, ఆర్ట్, మ్యూజిక్, డానన్స్, కథలు, మానవత్వ విలువలు నేర్పుతూ విద్యార్థుల మనోవికాసానికి పాటుపడాలన్నారు.
ఈ శిక్షణ తరగతులకు రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, గుంటూరు, భీమవరం భవన్స్ నుంచి సుమారు 475 మంది స్కూల్స్ టీచర్స్ హాజరయ్యారని ప్రిన్సిపాల్ ఎల్‌వీ రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల భవన్స్ స్కూల్స్ సెక్రటరీ యూకే విశ్వనాథరాజు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ సామంతపూడి శ్రీరామరాజు, కోశాధికారి కొత్త శ్రీనివాస్, స్కూల్ సంచాలకుడు బీవీ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
Dayalbagh Educational Institute: డీఈఐ అందిస్తున్న పలు కోర్సులు ఇవే.. దరఖాస్తులకు చివరి తేదీ!