Skip to main content

TREIRB Telangana Gurukula Lecturer Posts-తుది తీర్పు మేరకే గురుకుల లెక్చరర్ల నియామకాలు,స్పష్టం చేసిన హైకోర్టు

Government Notification for Gurukula Junior Lecturers Recruitment   TREIRB Telangana Gurukula Lecturer Posts    High Court Judgment on Gurukula Junior Lecturers Recruitment

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీ తుది తీర్పున కు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరాలు తెలు సుకుని చెప్పాలని స్టాండింగ్‌ కౌన్సిల్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చే యాలంటూ.. విచారణను వాయిదా వేసింది. గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్‌ లెక్చరర్ల భర్తీ కోసం గత సంవత్సరం ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది.

అయితే నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనలు పాటించకుండా తమను పక్కకు పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్‌ పల్లికి చెందిన గంగాప్రసాద్‌తో పాటు మరో 9 మంది హైకోర్టులో పిటి షన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయ మూర్తి జస్టిస్‌ పుల్ల కార్తీ క్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున న్యా యవాది చిల్లా రమేశ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్‌ చేసి నా డిగ్రీలో మాత్రం సంబంధిత సబ్జెక్ట్‌ చేసి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో డిగ్రీలో జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం చదివి.. ఎంఎస్సీలో మరో సబ్జెక్ట్‌ చదివిన పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు.

తదుపరి విచారణ వాయిదా
పరీక్షల అనంతరం ప్రకటించిన మెరిట్‌ లిస్ట్‌లో పిటిషనర్ల పేర్లు కూడా ఉన్నాయి. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత పిటిషనర్ల అర్హతపై నిపుణుల కమిటీ వేశామని.. నివేదిక వచ్చేదాకా ఆగాలని అధికా రులు సూచించారు. అయితే ఆ నివేదిక రాక ముందే పిటిషనర్లను పక్కకు పెట్టి ఇతరులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇచ్చారు. ప్రభుత్వ తీరు సమర్థనీయం కాదు.

మెరిట్‌ ప్రకారం పిటిషనర్లకు కూడా అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి’ అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు. 
 

Published date : 13 Mar 2024 11:12AM

Photo Stories