NEET UG 2024 Notification Details : నీట్ యూజీ 2024 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీ ఇదే.. సిలబస్‌లో మార్పులు ఇవే..
NEET UG 2024కి ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ పరీక్షను తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 13 భాషల్లో ఆఫ్‌లైన్‌లో మే 5వ తేదీన జరగనున్నది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ NEET UG పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
☛ NEET UG 2024: నీట్-యూజీ-2024 పరీక్ష విధానం.. బెస్ట్ ర్యాంకు సాధించేందుకు ప్రిపరేషన్ గైడెన్స్..
☛ All India Topper: నీట్ పరీక్షలో ఆలిండియా టాపర్‌గా.. నిర్వహించుకున్న వ్యూహం ఇదే..!
నీట్ యూజీ సిలబస్‌లో స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నీట్ యూజీ-2024 నూతన సిలబస్‌కు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో మార్పులు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) తాజాగా వివరాలను ప్రకటించింది. విద్యార్థులు పూర్తి వివరాలను https://neet.nta.nic.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
NEET UG 2024 సిలబస్ వివరాలివే.. :
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET UG) అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్‌లో స్వల్ప మార్పులు చేశారు. విద్యార్థులపై భారం తగ్గించే క్రమంలో నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) సిలబస్‌లో స్పల్ప మార్పులు చేసింది. NMC విడుదల చేసిన సిలబస్ ప్రకారం.. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లలో భారీగా సిలబస్‌ను తగ్గించారు. భౌతికశాస్త్రంలో కొంత ఎక్కువగా సిలబస్‌లో కోత విధించారు. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో స్వల్పంగా తగ్గించారు.
☛ Top Don'ts for NEET 2024: నీట్ కి ప్రిపేర్ అవుతున్నారా... ఇవి అస్సలు చేయకండి!
నీట్ యూజీ సిలబస్‌లో తొలగించిన పాఠ్యాంశాలివే :
☛ కెమిస్ట్రీ ఫస్టియర్ : పదార్థం స్థితి, హైడ్రోజన్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ.
☛కెమిస్ట్రీ సెకండియర్ : ఘనస్థితి, ఉపరితల రసాయశాస్త్రం, మెటలర్జీ, రోజువారీ జీవితంలో పాలిమర్లు, కెమిస్ట్రీ.
☛ ఫిజిక్స్ ఫస్టియర్ : ప్యూర్ రోలింగ్, కనెక్టింగ్ బాడీలు, పాలిట్రోపిక్ ప్రక్రియ, బలవంతమైన, దెబ్బతిన్న డోలనాలు.
☛ ఫిజిక్స్ సెకండియర్ : పొటెన్షియల్, నాన్ పొటెన్షియల్ సంభావ్యత, ప్రొటెన్షియో మీటర్, ఎర్త్ మ్యాగ్నటిజం, రేడియో యాక్టివిటీ, ట్రాన్సిస్టర్లు, ఆంప్లిప్లయర్లు.
☛ జువాలజీలో యూనిట్-2 : వానపాములు, యూనిట్-5లో శరీర నిర్మాణశాస్త్రం, జీర్ణక్రియ శోషణం, జ్ఞానేంద్రియాలు (చెవులు, కండ్లు), యూనిట్-10లో జీవావరణం, పర్యావరణం, పర్యావరణ సమస్యలు, పశుసంవర్ధకం.
☛ బోటనీ ఫస్టియర్ : ప్లాంట్ ఫిజియోలజీలో ట్రాన్స్‌పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్, మార్పొలజీ.
☛ బోటనీ సెకండియర్ : స్ట్రాటజీస్ ఫర్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్.
బోటనీలో కొత్తగా చేర్చిన అంశాలు : బయో మాలిక్యూల్స్, ఎంజైములు, ప్రాపర్టీలు, మాల్వేస్, లెగుమనీస్ సహా మరికొన్ని అంశాలను చేర్చారు.
☛ NEET Achiever: 20 ఏళ్ళ వయసులోనే నీట్ క్లియర్.. ఇది జరిగింది
☛ NEET 2023 Seat Allotments: MBBS రౌండ్-1 కటాఫ్ ర్యాంకులు ఇవే!
Tags
- NEET UG 20245 Notification
- neet ug 2024 exam date and time
- NEET UG
- NEET UG 2024 Biology Syllabus
- NEET UG 2024 Physics Syllabus
- NEET UG 2024 Chemistry Syllabus
- NTA NEET UG 2024 Exam Date
- NEET UG 2024 Dates
- NEET UG 2024 Online Apply
- how to apply for neet exam 2024
- neet ug exam fees 2024
- neet exam syllabus 2024
- neet ug 2024 syllabus
- neet ug 2024 syllabus change
- neet ug 2024 important dates
- neet ug 2024 important dates in telugu
- neet ug 2024 exam date latest news
- sakshi education latestnews