Skip to main content

Holidays: విద్యాసంస్థల పునః ప్రారంభం అప్పటి నుంచే..ఈ సారి పరీక్షలను..?

సాక్షి, హైదరాబాద్‌: విద్యా సంస్థలను జ‌న‌వ‌రి 31వ తేదీ నుంచి పునః ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడితే దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది.
Holidays
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని జ‌న‌వ‌రి 20వ తేదీన‌ స్పష్టం చేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం జ‌న‌వ‌రి 30 వరకూ పొడిగించింది. అయితే దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే క్రమంలో విద్యా బోధన కుంటుపడిందన్న వాదన కూడా విన్పిస్తోంది.

సెలవులు పొడిగించకతప్పదనే..

Students


తాజా పరిస్థితిని గమనిస్తే కోవిడ్‌ తీవ్రత జ‌న‌వ‌రి నెలాఖరుకు క్రమంగా తగ్గుతుందని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 31 నుంచి విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌పై అధికారుల నుంచి నివేదిక కోరినట్టు మంత్రి ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అయితే, కరోనా తీవ్రత పెరిగితే సెలవులు పొడిగించకతప్పదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ క్లాసులపై క్లారిటీ ఇవ్వకపోవడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించగా, కొద్ది రోజుల కోసం ఎందుకన్నట్టు బదులిచ్చారు. దీన్నిబట్టి పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం బలమైన నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తోంది.  

ఈ సారి పరీక్షలను..

Exams


ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పరీక్షల రద్దు, ప్రమోట్‌ చేయడం వంటివి ఉండబోవని సబిత తేల్చి చెప్పారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని ఆమె అన్నారు. విద్యార్థులు ఇలాంటి ఆశలు పెట్టుకోకుండా వీలైనంత వరకూ పరీక్షల్లో విజయం సాధించేందుకు కష్టపడాలని చెప్పారు.  

Breaking News: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు.. ఇక ఏపీలో అయితే.. ?

Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Telangana: జ‌న‌వ‌రి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు

విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవ‌కాశం..ఎందుకంటే..?

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

Covid-19 Effect: జనవరి 26 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్‌

Audimulapu Suresh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించ‌డం లేదు..కార‌ణం ఇదే..

Published date : 20 Jan 2022 09:27AM

Photo Stories